ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

IPL 2025 DC vs SRH: అక్షర్ ఆడతాడా.. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు వీరే

ABN, Publish Date - May 05 , 2025 | 05:43 PM

తొలి నాలుగు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఆ తర్వాత ఆరు మ్యాచ్‌ల్లో రెండింట్లో మాత్రమే గెలుపొంది ఐదో స్థానానికి దిగజారిపోయింది. ఈ నేపథ్యంలో ఈ రోజు కీలక పోరుకు రెడీ అవుతోంది.

SRH vs DC

టోర్నీ (IPL 2025)ని అద్భుతంగా ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టు ఆ తర్వాత గాడి తప్పింది. తొలి నాలుగు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఆ తర్వాత ఆరు మ్యాచ్‌ల్లో రెండింట్లో మాత్రమే గెలుపొంది ఐదో స్థానానికి దిగజారిపోయింది. ఈ నేపథ్యంలో ఈ రోజు కీలక పోరుకు రెడీ అవుతోంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తలపడుతోంది (DC vs SRH). ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్లే ఆఫ్స్ ఫైట్‌లో ముందుకు వెళ్లగలుగుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ ఢిల్లీకి అత్యంత కీలకమైన మ్యాచ్ అని చెప్పాల్సిందే.


ఇప్పటకే ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపు కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టు ఈ మ్యాచ్‌లో కూడా ఓడితే ఇక టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించినట్టే. నిజానికి ఈ మ్యాచ్‌లో గెలిచినా హైదరాబాద్ జట్టుకు పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు. ఎందుకంటే ఇప్పటివరకు పది మ్యాచ్‌లు ఆడిన ప్యాట్ కమిన్స్ టీమ్ కేవలం మూడింట్లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. ఈ రోజు మ్యాచ్‌లో గెలిస్తే హైదరాబాద్ టీమ్ సాంకేతికంగా ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది.


ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ గత మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. మ్యాచ్ జరుగుతుండగానే మైదానాన్ని వీడాడు. ఈ నేపథ్యలో ఈ రోజు మ్యాచ్‌లో అక్షర్ పటేల్ ఆడేది అనుమానంగానే ఉంది. అక్షర్ పటేల్ ఆడకపోతే అతడి స్థానంలో డుప్లెసిస్ ఢిల్లీ టీమ్‌కు నాయకత్వం వహిస్తాడు. ఢిల్లీ టీమ్‌లో అభిషేక్ పోరెల్, డుప్లెసిస్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, అక్షర్ పటేల్ కీలక ఆటగాళ్లు. అలాగే హైదరాబాద్ టీమ్ తరఫున ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి కీలక ఆటగాళ్లు.


తుది జట్లు:

సన్‌రైజర్స్ హైదరాబాద్ (అంచనా): అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, మెండిస్, నితీష్ కుమార్ రెడ్డి, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, ఉనద్కత్, మహ్మద్ షమీ

ఢిల్లీ క్యాపిటల్స్ (అంచనా): అభిషేక్ పోరెల్, డుప్లెసిస్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్, విప్రాజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ఛమీరా, ముఖేష్ కుమార్

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 05 , 2025 | 05:43 PM