IPL 2025 DC vs SRH: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు.. సన్‌రైజర్స్‌కు నో ప్లే ఆఫ్స్ ఛాన్స్
ABN, Publish Date - May 05 , 2025 | 11:42 PM
హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం కారణంగా ఐపీఎల్ మ్యాచ్ రద్దయింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం కారణంగా ఐపీఎల్ మ్యాచ్ రద్దయింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఢిల్లీ టీమ్ బ్యాటింగ్‌కు దిగింది. అయితే తొలి ఇన్నింగ్స్ పూర్తయిన తర్వాత హైదరాబాద్‌లో భారీ వర్షం మొదలైంది. దాదాపు గంట పాటు ఏకధాటిగా కురిసింది. ఆ తర్వాత వర్షం తగ్గినప్పటికీ మైదానం పూర్తిగా తడిసిపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు.
మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించింది. అంతకు ముందు ప్లేఆఫ్స్ రేసులో ముందుకెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ తడబడింది. పూర్తిగా బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఢిల్లీ టాపార్డర్ బ్యాటర్లు చేతులెత్తేశారు. బంతిని టచ్ చేస్తే అవుట్ అవుతామని భయపడ్డారు. తొలి ఐదుగురు బ్యాటర్లలో ఒక్కరూ కూడా పది పరుగులు దాటి చేయలేకపోయారు. అయితే చివరి బ్యాటర్లు కీలక పరుగులు చేయడంతో ఢిల్లీ చెప్పుకోదగ్గ స్కోరు సాధించింది.
టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఢిల్లీ టీమ్ బ్యాటింగ్‌కు దిగింది. బౌలింగ్‌కు మద్దతుగా నిలిచిన ఉప్పల్ పిచ్‌పై సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నిప్పులు చెరిగాడు. కరుణ్ నాయర్, డుప్లెసిస్, అభిషేక్ పోరెల్‌ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్‌ను ఉనద్కత్, అక్షర్ పటేల్‌ను హర్షల్ పటేల్ అవుట్ చేశారు. దీంతో 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన సన్‌రైజర్స్‌ను అషుతోష్ శర్మ (41), ట్రిస్టన్ స్టబ్స్ (41) ఆదుకున్నారు. విప్రాజ్ నిగమ్ (18) కూడా కీలక పరుగులు చేశాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేయగలిగింది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 05 , 2025 | 11:42 PM