IPL 2025, DC vs RR: ఢిల్లీ కోటలో పాగా వేస్తారా.. రాజస్తాన్‌కు విజయం అందేనా
ABN, Publish Date - Apr 16 , 2025 | 05:05 PM
అక్షర్ పటేల్ సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడి నాలుగింట్లో విజయాలు సాధించింది. గత మ్యాచ్‌లో ముంబై చేతిలో ఓడి ఈ సీజన్‌లో తొలి పరాజయాన్ని చవిచూసింది. ఈ రోజు (ఏప్రిల్ 16) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్ జట్టుతో తలపడబోతోంది.
ఈ సీజన్ (IPL 2025)లో అత్యంత స్థిరంగా రాణిస్తున్న జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi capitals). అక్షర్ పటేల్ సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడి నాలుగింట్లో విజయాలు సాధించింది. గత మ్యాచ్‌లో ముంబై చేతిలో ఓడి ఈ సీజన్‌లో తొలి పరాజయాన్ని చవిచూసింది. ఈ రోజు (ఏప్రిల్ 16) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals) జట్టుతో తలపడబోతోంది. మరోవైపు రాజస్తాన్ రాయల్స్ పడుతూ, లేస్తూ ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడి కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించింది (DC vs RR).
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం స్పిన్‌కు చక్కగా సహకరిస్తుంది. మొదటి ఇన్నింగ్స్‌తో పోల్చుకుంటే రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ కాస్త స్లో అవుతుంది. మంచు ప్రభావం లేకపోవడంతో వాతావరణం చాలా పొడిగా, వేడిగా ఉంటుంది. ఇక, ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు 39 సార్లు తలపడ్డాయి. వాటిల్లో 15 సార్లు రాజస్తాన్ రాయల్స్ విజయం సాధించింది. 14 సార్లు ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపొందింది. హెడ్ టు హెడ్ రికార్డులో రాజస్తాన్‌దే పైచేయిగా కనిపిస్తున్నప్పటికీ ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ పూర్తి విభిన్నంగా ఉంది.
అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ విభాగాల్లో సమతూకంగా ఉంది. కేఎల్ రాహుల్, కరుణ నాయర్, స్టబ్స్ బ్యాట్‌తో చక్కగా రాణిస్తున్నారు. అలాగే కెప్టెన్ అక్షర్ పటేల్‌తో పాటు మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ, కుల్దీప్ యాదవ్‌లతో కూడిన బౌలింగ్ విభాగం పరుగులను కట్టడి చేస్తోంది. మరోవైపు రాజస్తాన్ టీమ్‌లోని కీలక ఆటగాళ్లు ఫామ్ కోల్పోయి సతమతమవుతున్నారు. యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ తమ సామర్థ్యం మేరకు రాణించలేకపోతున్నారు. బ్యాటింగ్‌తో పోల్చుకుంటే బౌలింగ్‌లో రాజస్తాన్ కాస్త బలంగా కనబడుతోంది. మరి, ఢిల్లీ గడ్డపై అక్షర్ సేనను రాజస్తాన్ ఓడించగలదో లేదో చూద్దాం.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Apr 16 , 2025 | 05:05 PM