IPL 2025 DC vs RCB: టాప్ స్పాట్‌కు ఆర్సీబీ.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలుపు
ABN, Publish Date - Apr 27 , 2025 | 11:30 PM
వరుస విజయాలతో దూసుకుపోతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు స్వంత మైదానంలో తడబడింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది
వరుస విజయాలతో దూసుకుపోతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు స్వంత మైదానంలో తడబడింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది (DC vs RCB). ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆర్సీబీ ఆరు వికెట్ల తేడాతో గెలిపింది. కింగ్ కోహ్లీ మరోసారి అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ విభాగాల్లో రాణించిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.
టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడతూ బెంగళూరు బౌలర్లు చక్కగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా హాజెల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేసి పరుగులు రాకుండా కట్టడి చేశారు. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (41) టాప్ స్కోరర్. ఓపెనర్లు అభిషేక్ పోరెల్ (28), డుప్లెసిస్ (22) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. చివర్లో స్టబ్స్ (34) కీలక పరుగుల చేశఆడు. దీంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు తీశాడు. హాజెల్‌వుడ్ రెండు వికెట్లు తీశాడు. యశ్ దయాల్, కృనాల్ పాండ్యా ఒక్కో వికెట్ పడగొట్టారు.
ఢిల్లీ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయింది. జాకబ్ (12), పడిక్కళ్ (0), పటిదార్ (6) త్వరత్వరగా వికెట్ కోల్పోవడంతో 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఆర్సీబీ కష్టాల్లో పడింది. అయితే విరాట్ కోహ్లీ (61), కృనాల్ పాండ్యా (73 నాటౌట్) భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో ఆర్సీబీ విజయం సాధించింది. చివర్లో టిమ్ డేవిడ్ (19) కీలక పరుగులు చేశాడు. దీంతో ఆర్సీబీ 18.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Apr 27 , 2025 | 11:30 PM