ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

IPL 2025 DC vs LSG: లఖ్‌నవూ బ్యాటర్ల వైఫల్యం.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే

ABN, Publish Date - Apr 22 , 2025 | 09:09 PM

లఖ్‌నవూ బ్యాటర్లు అదిరిపోయే ఆరంభాన్ని అందిపుచ్చుకోలేకపోయారు. ఓపెనర్లు ఇచ్చిన మెరుపు ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయారు. మిడిల్ ఓవర్లలో ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ స్వల్ప స్కోరుకే పరిమితమైంది.

DC vs LSG

లఖ్‌నవూ బ్యాటర్లు అదిరిపోయే ఆరంభాన్ని అందిపుచ్చుకోలేకపోయారు. ఓపెనర్లు ఇచ్చిన మెరుపు ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయారు. మిడిల్ ఓవర్లలో ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లఖ్‌నవూ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్లు మార్‌క్రమ్ (52), మిచెల్ మార్ష్ (45) తప్ప మిగతా బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేదు. దీంతో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేసింది.


టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో లఖ్‌నవూ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్, మార్‌క్రమ్ తొలి వికెట్‌కు 87 పరుగులు రాబట్టారు. దీంతో లఖ్‌నవూ భారీ స్కోరు చేయడం ఖాయంగా కనిపించింది. అయితే మార్‌క్రమ్ అవుట్ కాగానే పరిస్థితి మారిపోయింది. కొద్దిసేపటికే కేవలం 9 పరుగులు మాత్రమే చేసి నికోలస్ పూరన్ అవుటయ్యాడు. ఆ వెంటనే అబ్దుల్ సమద్, మిచెల్ మార్ష్ కూడా వెంటవెంటనే ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో అవుటై వెనుదిరిగారు. ఢిల్లీ బౌలర్లందరూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు చేయడానికి లఖ్‌నవూ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు.


చివర్లో బదోనీ (36) కీలక పరుగులు చేశాడు. దీంతో లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేసింది. ఢిల్లీ ముందు 160 పరుగుల లక్ష్యాన్నిమాత్రమే ఉంచగలిగింది. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ నాలుగు వికెట్లు తీశాడు. మిచెల్ స్టార్క్, ఛమీరా ఒక్కో వికెట్ తీశారు. ప్రస్తుత ఫామ్‌ను బట్టి చూస్తే ఈ లక్ష్యాన్ని ఢిల్లీ సులభంగా చేజింగ్ చేసేలాగానే కనిపిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 22 , 2025 | 10:58 PM