IPL 2025 DC vs GT: అడుగు దూరంలో గుజరాత్.. మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫామ్
ABN, Publish Date - May 18 , 2025 | 04:39 PM
ఆదివారం రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్‌లో గుజరాత్ గెలిస్తే ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌లోకి అడుగు పెట్టిన తొలి జట్టుగా నిలుస్తుంది. అలాగే పాయింట్ల పట్టికల్లో అగ్రస్థానానికి చేరుకుంటుంది.
అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగి అద్భుతంగా ఆడుతున్న గుజరాత్ టైటాన్స్ (GT) అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంటున్న గుజరాత్ టైటాన్స్ జట్టు ప్లే ఆఫ్స్‌కు అడుగు దూరంలో ఉంది. ఒక్క విజయం సాధిస్తే తాజా సీజన్‌లో (IPL 2025) ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఆదివారం రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్‌లో గుజరాత్ గెలిస్తే ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌లోకి అడుగు పెట్టిన తొలి జట్టుగా నిలుస్తుంది. అలాగే పాయింట్ల పట్టికల్లో అగ్రస్థానానికి చేరుకుంటుంది (GT vs DC).
ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధిస్తే టాప్-4లోకి అడుగు పెడుతుంది. ప్లే ఆఫ్స్‌లోకి చేరే అవకాశాన్ని మెరుగుపరుచుకుంటుంది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ 6 విజయాలతో 13 పాయింట్లో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. గత ఐదు మ్యాచ్‌ల్లో ఢిల్లీ కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. మరోవైపు గుజరాత్ ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి 8 విజయాలతో 16 పాయింట్లో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. గత ఐదు మ్యాచ్‌ల్లో గుజరాత్ కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే పరాజయం పాలైంది.
ఐపీఎల్ చరిత్రలో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. వాటిల్లో ఇరు జట్లు చెరో మూడు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందాయి. ఇక, ఢిల్లీలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు రెండు సార్లు పోటీపడగా ఇరు జట్లు చెరో మ్యాచ్‌లో విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో ఆదివారం జరగబోయే మ్యాచ్ ఇరు జట్లకు అత్యంత కీలక మ్యాచ్. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరువ అవుతుంది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 18 , 2025 | 04:39 PM