IPL 2025 DC vs GT: ఢిల్లీలో సూపర్ మ్యాచ్.. ఇరు జట్లలో కీలక ఆటగాళ్లు వీరే
ABN, Publish Date - May 18 , 2025 | 04:54 PM
ఢిల్లీలో మరో కీలక మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. టాప్-4 కోసం కీలక పోరు జరుగుతోంది. ఆదివారం రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడబోతున్నాయి. అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంటున్న గుజరాత్ టైటాన్స్ జట్టు ప్లే ఆఫ్స్‌కు అడుగు దూరంలో ఉంది.
ఢిల్లీలో మరో కీలక మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. టాప్-4 కోసం కీలక పోరు జరుగుతోంది. ఆదివారం రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడబోతున్నాయి. అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంటున్న గుజరాత్ టైటాన్స్ జట్టు ప్లే ఆఫ్స్‌కు అడుగు దూరంలో ఉంది. ఒక్క విజయం సాధిస్తే తాజా సీజన్‌లో (IPL 2025) ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ గెలిస్తే ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌లోకి అడుగు పెట్టిన తొలి జట్టుగా నిలవడమే కాకుండా పాయింట్ల పట్టికల్లో అగ్రస్థానానికి చేరుకుంటుంది (GT vs DC).
గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఎప్పటిలాగానే టాపార్డర్ బ్యాటర్లు కీలకంగా మారనున్నారు. సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, జాస్ బట్లర్ కీలకంగా వ్యవహరించనున్నారు. టాపార్డర్ బ్యాటర్లతో పాటు మిడిలార్డర్, టెయిలెండర్స్ ఫామ్‌లోకి రావాల్సి ఉంది. ఇక, బౌలింగ్‌లో అర్షద్ ఖాన్, ప్రసిద్ధ్ ఖాన్, మహ్మద్ సిరాజ్ కీలకంగా వ్యవహరించనున్నారు. ఇక, ఢిల్లీ బ్యాటింగ్‌కు డుప్లెసిస్, అభిషేక్ పోరెల్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ కీలకంగా ఉన్నారు. స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ దూరం కావడం ఢిల్లీ జట్టుకు పెద్ద దెబ్ అని చెప్పక తప్పదు. దీంతో ఇండియన్ బౌలర్లు నటరాజన్, కుల్దీప్ యాదవ్, చమీరా రాణించాల్సిన అవసరం ఉంది.
తుది జట్లు:
గుజరాత్ టైటాన్స్ (అంచనా): సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, జాస్ బట్లర్, రాహుల్ తెవాటియా, షారూక్ ఖాన్, రషీద్ ఖాన్, సాయి కిశోర్, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
ఢిల్లీ క్యాపిటల్స్ (అంచనా): అభిషేక్ పోరెల్, డుప్లెసిస్, కేఎల్ రాహుల్, సమీర్ రజ్వీ, అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్, మాధవ్ తివారీ, ముస్తాఫిజర్ రెహ్మాన్, ఛమీరా, కుల్దీప్ యాదవ్, నటరాజన్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 18 , 2025 | 04:54 PM