ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

IPL 2025 DC vs GT: ప్లే ఆఫ్స్‌కు గుజరాత్.. ఢిల్లీపై ఘన విజయం

ABN, Publish Date - May 18 , 2025 | 11:06 PM

ఐపీఎల్‌లో గుజరాత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఢిల్లీపై ఏకంగా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఓపెనర్లు సాయి సుదర్శన్ (100), శుభ్‌మన్ గిల్ () తమ ఫామ్‌ను కొనసాగిస్తూ గుజరాత్‌కు ఘన విజయాన్ని అందించారు.

Gujarat Titans won by 10 wickets against Delhi Capitals

ఐపీఎల్‌లో గుజరాత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఢిల్లీపై ఏకంగా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఓపెనర్లు సాయి సుదర్శన్ (108 నాటౌట్), శుభ్‌మన్ గిల్ (93 నాటౌట్) తమ ఫామ్‌ను కొనసాగిస్తూ గుజరాత్‌కు ఘన విజయాన్ని అందించారు. ఈ ఓటమితో ఢిల్లీ తన ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి.


టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. డుప్లెసిస్ (5) త్వరగానే ఔటైనా మిగిలిన బ్యాటర్లు సమయోచితంగా రాణించారు. కేఎల్ రాహుల్ (112 నాటౌట్) సెంచరీ చేశాడు. రాహుల్‌తో అభిషేక్ పోరెల్ (30), అక్షర్ పటేల్ (25) కీలక భాగస్వామ్యాలు నెలకొల్పారు. చివర్లో ట్రిస్టన్ స్టబ్స్ (21) కూడా వేగంగా పరుగులు చేశాడు. దీంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, అర్షద్ ఖాన్, సాయి కిశోర్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.


200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ సునాయాసంగా ఛేజింగ్‌ను పూర్తి చేసింది. ఓపెనర్లు సాయి సుదర్శన్ (108 నాటౌట్), శుభ్‌మన్ గిల్ (93 నాటౌట్) మరోసారి చెలరేగారు. ఢిల్లీ బౌలర్లకు ఎలాంటి అవకాశమూ ఇవ్వకుండా సునాయాసంగా పరుగులు చేశారు. ఢిల్లీ ఓపెనర్ సాయి సుదర్శన్ తన ఫామ్ కొనసాగిస్తూ మరో సెంచరీ చేశాడు. మరో ఎండ్‌లో గిల్ కూడా అద్భుతంగా ఆడాడు. దీంతో ఢిల్లీ నిర్దేశించిన లక్ష్యాన్ని గుజరాత్ 19 ఓవర్లలోనే పూర్తి చేసింది. ప్లే ఆఫ్స్ బెర్త్‌ను కన్ఫామ్ చేసుకుంది.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండవ..

Updated Date - May 18 , 2025 | 11:06 PM