IPL 2025 DC: ఎట్టకేలకు ఓ ఛాన్స్.. రూ.10 కోట్ల ఆటగాడిని రంగంలోకి దించిన ఢిల్లీ క్యాపిటల్స్
ABN, Publish Date - May 05 , 2025 | 08:46 PM
దాదాపు పది మ్యాచ్‌ల పాటు నటరాజన్‌ను బెంచ్ మీదనే ఉంచిన ఢిల్లీ యాజమాన్యం ఎట్టకేలకు అతడికి తుది జట్టులో అవకాశం కల్పించింది. బౌలర్ ముఖేష్ కుమార్ స్థానంలో నటరాజన్‌ను తీసుకుంది. లెఫ్టార్మ్ పేసర్ అయిన నటరాజన్‌ను ఢిల్లీ యాజమాన్యం గతేడాది మెగా వేలంలో ఏకంగా రూ.10.75 కోట్లు వెచ్చించి దక్కించుకుంది.
తమిళనాడుకు చెందిన స్పీడ్‌స్టర్ టి.నటరాజన్ (Natarajan) ఎట్టకేలకు మైదానంలోకి దిగబోతున్నాడు. దాదాపు పది మ్యాచ్‌ల పాటు నటరాజన్‌ను బెంచ్ మీదనే ఉంచిన ఢిల్లీ (DC) యాజమాన్యం ఎట్టకేలకు అతడికి తుది జట్టులో అవకాశం కల్పించింది. బౌలర్ ముఖేష్ కుమార్ స్థానంలో నటరాజన్‌ను తీసుకుంది. లెఫ్టార్మ్ పేసర్ అయిన నటరాజన్‌ను ఢిల్లీ యాజమాన్యం గతేడాది మెగా వేలంలో ఏకంగా రూ.10.75 కోట్లు వెచ్చించి దక్కించుకుంది (IPL 2025).
ఏకంగా రూ.10.75 కోట్లు వెచ్చించి దక్కించుకున్న నటరాజన్‌కు తుది జట్టులో ఛాన్స్ దక్కకపోవడం నిజంగా ఆశ్చర్యకరం. మిచెల్ స్టార్క్, దుష్మంత్ ఛమీరా, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్ వంటి బౌలర్లతో ఢిల్లీ బౌలింగ్ విభాగం పటిష్టంగానే ఉంది. దీంతో నటరాజన్ తుది జట్టులో చోటు దక్కించుకోవడానికి చాలా కాలం వెయిట్ చేయాల్సి వచ్చింది.
మరో విశేషం ఏంటంటే నటరాజన్ 2020-24 వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున బరిలోకి దిగేవాడు. ఈ నాలుగు మ్యాచ్‌ల్లో 56 మ్యాచ్‌లు ఆడి 65 వికెట్లు తీశాడు. తను గతంలో ఆడిన జట్టు పైనే నటరాజన్ ఈ సీజన్‌లో ఢిల్లీ తరఫున అరంగేట్రం చేయబోతున్నాడు (SRH vs DC). ఈ నేపథ్యంలో నటరాజన్ నుంచి ఎలాంటి ప్రదర్శన వస్తుందో వేచి చూడాలి.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 05 , 2025 | 08:46 PM