IPL 2025, CSK vs RR: చెన్నై సూపర్ కింగ్స్ vs రాజస్తాన్ రాయల్స్.. ఈ ఇద్దరిలో పైచేయి ఎవరిది
ABN, Publish Date - Mar 30 , 2025 | 05:01 PM
గౌహతిలో ఈ రోజు సాయంత్రం 7:30 గంటలకు జరగబోయే మ్యాచ్‌లో చెన్నై, రాజస్తాన్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్‌లో జరగబోతోంది. రియాన్ పరాగ్ సారథ్యంలోని రాజస్తాన్, రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.
ఐపీఎల్ (IPL 2025)పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న రాజస్తాన్ రాయల్స్ తొలి విజయం కూడా బరిలోకి దిగుతోంది. ఇక, ఇప్పటికి ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి, మరొకటి ఓడిన చెన్నైతో తలపడేందుకు సిద్ధమవుతోంది (CSK vs RR). గౌహతిలో ఈ రోజు సాయంత్రం 7:30 గంటలకు జరగబోయే మ్యాచ్‌లో చెన్నై, రాజస్తాన్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్‌లో జరగబోతోంది. రియాన్ పరాగ్ సారథ్యంలోని రాజస్తాన్, రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.
చెన్నై, రాజస్తాన్ జట్లు ఇప్పటివరకు ఐపీఎల్‌లో 29 సార్లు తలపడ్డాయి. అందులో చెన్నై టీమ్ 16 సార్లు విజయం సాధించింది. రాజస్తాన్ జట్టు 13 సార్లు విజేతగా నిలిచింది. ఇక, తటస్థ వేదికల్లో చెన్నై, రాజస్తాన్ టీమ్‌లు ఇప్పటివరకు 13 సార్లు పోటీపడ్డాయి. అందులో రాజస్తాన్ 7 సార్లు, చెన్నై 6 సార్లు విజేతగా నిలిచాయి. గౌహతిలోని బర్సాపార క్రికెట్ స్టేడియంలో ఈరోజు మ్యాచ్ జరగబోతోంది. ఈ వేదికలో చెన్నై టీమ్‌కు ఇదే తొలి మ్యాచ్. ఈ వేదికలో రాజస్తాన్‌కు కూడా సరైన రికార్డు లేదు. ఇప్పటివరకు ఈ వేదికలో రాజస్తాన్ ఐదుసార్లు తలపడగా కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించింది.
రాజస్తాన్ టీమ్ కంటే చెన్నై కాస్తా బలంగా కనిపిస్తోంది. సంజూ శాంసన్ ఫిట్‌గా లేకపోవడంతో అతడి స్థానంలో రియాన్ పరాగ్ సారథ్యం వహిస్తున్నాడు. కాగా, రాజస్తాన్ టీమ్ ఆరంభ సీజన్‌లో ట్రోఫీ సాధించింది. ఆ తర్వాత ఒక్కసారి కూడా కప్ గెలవలేదు. మరోవైపు చెన్నై టీమ్ మాత్రం 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీలను సాధించింది.
ఇవి కూడా చదవండి..
ఐపీఎల్ ఓనర్లలో మోస్ట్ రిచ్ ఎవరంటే..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Mar 30 , 2025 | 05:27 PM