ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kavya Maran: కావ్య మారన్‌కు బ్యాడ్ న్యూస్.. ఐపీఎల్‌ను తిరిగి ప్రారంభిస్తున్నారు కానీ

ABN, Publish Date - May 13 , 2025 | 03:50 PM

గతేడాది అద్భుతమైన ఆటతీరుతో అదరొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ ఏడాది దారుణంగా విఫలమైంది. వరుస పరాజయాలతో సతమతమైంది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి కేవలం మూడే విజయాలతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపు కోల్పోయింది.

Kavya Maran

గతేడాది అద్భుతమైన ఆటతీరుతో అదరొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఈ ఏడాది దారుణంగా విఫలమైంది. వరుస పరాజయాలతో సతమతమైంది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి కేవలం మూడే విజయాలతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపు కోల్పోయింది. పాకిస్తాన్-భారత్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆగిపోయిన ఐపీఎల్ తిరిగి ప్రారంభం కాబోతోంది. ఈనెల 17న బెంగళూరులో లీగ్‌ పునఃప్రారంభమవుతుంది (IPL 2025).


ఐపీఎల్‌ను వాయిదా వేయడంతో విదేశీ ఆటగాళ్లు తమ తమ స్వదేశాలకు వెళ్లిపోయారు. అయితే కొందరు ఆటగాళ్లు తిరిగి వెనక్కి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. కానీ, సన్‌రైజర్స్ జట్టు కీలక ఆటగాళ్లైన ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్ మాత్రం తిరిగి భారత్‌కు రావడం లేదట. సన్‌రైజర్స్ జట్టు కెప్టెన్ అయిన ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియా టెస్ట్ జట్టుకు కూడా సారథ్యం వహిస్తున్నాడు. జూన్ 11వ తేదీన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మొదలు కాబోతోంది.


ఆ మ్యాచ్ ప్రాక్టీస్‌లో ప్యాట్ కమిన్స్ జాయిన్ అయ్యాడు. దీంతో అతడు తిరిగి భారత్‌కు రావడం లేదు. మరోవైపు ట్రావిస్ హెడ్ తిరిగి రావడం కూడా అనుమానమే. ఇక, హైదరాబాద్ జట్టు హోమ్ గ్రౌండ్‌లో ఆడే అవకాశాన్ని కూడా కోల్పోయింది. ఐపీఎల్‌లో మిగిలిన 17 మ్యాచ్‌లను ఆరు వేదికల్లోనే నిర్వహించబోతున్నారు. మే 25న హైదరాబాద్‌లో జరగాల్సిన మ్యాచ్ వేదికను ఢిల్లీకి మార్చారు. దీంతో కావ్యమారన్‌కు షాక్‌లు మీద షాక్‌లు తగులుతున్నాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 13 , 2025 | 03:50 PM