IPL Match Suspended: బాంబులు పడతాయేమోనని
ABN, Publish Date - May 10 , 2025 | 05:09 AM
ఇండో-పాక్ సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా పంజాబ్ కింగ్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ అర్ధంతరంగా నిలిపివేయడం జరిగింది. భద్రతా కారణాల వల్ల ఆటగాళ్లు, ప్రేక్షకులు స్టేడియం నుంచి వెళ్లిపోయారు, ఒక చీర్‌గాళ్ సోషల్ మీడియాలో వీడియో ద్వారా సంఘటన గురించి తెలిపింది.
న్యూఢిల్లీ: ఇండో-పాక్ సరిహద్దు ఉద్రిక్తతలతో ధర్మశాలలో గురువారం పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను అర్ధంతరంగా మధ్యలోనే నిలిపివేశారు. దీంతో స్టేడియం భద్రతా సిబ్బంది సూచనతో ఆటగాళ్లు, ప్రేక్షకులు సహా అంతా స్టేడియం నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ జట్టు చీర్‌గాళ్ తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఇక్కడంతా భయంగా ఉంది. మ్యాచ్ మధ్యలోనే అందరినీ పంపించివేశారు. చాలామంది.. బాంబులు పడతాయేమోనని అరుచుకుంటూ వెళ్లిపోయారు. అయినా, నేను ఏడవడం లేదు. కానీ, షాక్‌లో ఉన్నా. అయితే, భద్రతపరంగా ఐపీఎల్ ప్రతినిధులు సరైన చర్యలే తీసుకున్నారు’ అని ఆ వీడియోలో చీర్‌గాళ్ వ్యాఖ్యలు చేసింది.
Updated Date - May 10 , 2025 | 05:10 AM