ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఫైనల్‌ బెర్త్‌ లక్ష్యంగా..

ABN, Publish Date - May 04 , 2025 | 02:52 AM

మహిళల ముక్కోణపు వన్డే సిరీ్‌సలో భారత జట్టు దూసుకెళ్తోంది. ఇప్పటికే శ్రీలంక, దక్షిణాఫ్రికాపై వరుస విజయాలతో పట్టికలో టాప్‌లో ఉంది. తాజాగా ఆదివారం ఆతిథ్య శ్రీలంకతో...

ఉదయం 10.గం నుంచి

నేడు శ్రీలంకతో భారత్‌ పోరు

మహిళల ముక్కోణపు వన్డే సిరీస్‌

కొలంబో: మహిళల ముక్కోణపు వన్డే సిరీ్‌సలో భారత జట్టు దూసుకెళ్తోంది. ఇప్పటికే శ్రీలంక, దక్షిణాఫ్రికాపై వరుస విజయాలతో పట్టికలో టాప్‌లో ఉంది. తాజాగా ఆదివారం ఆతిథ్య శ్రీలంకతో మరో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. అన్ని విభాగాల్లోనూ రాణిస్తోన్న భారత జట్టు ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి హ్యాట్రిక్‌ విజయంతో పాటు ఫైనల్లోనూ చోటు దక్కించుకోవాలనుకుంటోంది. అలాగే సంచలన ఓపెనర్‌ ప్రతీక రావల్‌.. సచిన్‌ రికార్డును బ్రేక్‌ చేసేందుకు ఎదురుచూస్తోంది. ప్రస్తుతం తను వరుసగా ఐదు హాఫ్‌ సెంచరీలతో సచిన్‌, ద్రవిడ్‌ సరసన ఉంది. మహిళల క్రికెట్‌లో ఈ రికార్డు మిథాలీ రాజ్‌ (7) పేరిట కొనసాగుతోంది. స్పిన్నర్లు స్నేహ్‌ రాణా, శ్రీ చరణి మరోసారి కీలకం కానున్నారు. అటు దక్షిణాఫ్రికాతో గెలిచిన శ్రీలంక జట్టు భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. కెప్టెన్‌ చమరి పేలవ ఫామ్‌ ఆందోళన కలిగిస్తోంది. అయితే మిడిలార్డర్‌లో హర్షిత-కవిష జోడీ దీటుగా నిలబడితే భారత్‌కు ఇబ్బందే.

ఇవి కూడా చదవండి..

ఈ తప్పులు చేయకుంటే హైదరాబాద్ జట్టు గెలిచేది..కానీ చివరకు

ట్రాన్స్‌జెండర్లకు చోటు లేదు

హైదరాబాద్ ఓటమి, గుజరాత్ ఘన విజయం

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 04 , 2025 | 02:52 AM