ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అదరగొట్టిన భారత అథ్లెట్లు

ABN, Publish Date - Jun 09 , 2025 | 05:24 AM

తైవాన్‌ ఓపెన్‌ ఇంటర్నేషనల్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌ప రెండో రోజూ భారత క్రీడాకారులు అదరగొట్టారు. తొలి రోజు ఆరు పసిడి పతకాలు కొల్లగొట్టిన మనోళ్లు..ఆదివారం మరో ఆరు స్వర్ణాలు సొంతం చేసుకొన్నారు...

చివరి రోజు ఆరు స్వర్ణాలు

తైవాన్‌ ఇంటర్నేషనల్‌ మీట్‌

తైపీ సిటీ: తైవాన్‌ ఓపెన్‌ ఇంటర్నేషనల్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌ప రెండో రోజూ భారత క్రీడాకారులు అదరగొట్టారు. తొలి రోజు ఆరు పసిడి పతకాలు కొల్లగొట్టిన మనోళ్లు..ఆదివారం మరో ఆరు స్వర్ణాలు సొంతం చేసుకొన్నారు. చివరి రోజు.. జాతీయ చాంపియన్‌ విత్య రామ్‌రాజ్‌, రోహిత్‌ యాదవ్‌, పూజ, కృష్ణకుమార్‌, అన్నూరాణి, పురుషుల 4గీ400 మీటర్ల రిలే జట్టు పసిడి పతకాలు దక్కించుకున్నాయి. పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో పాలాక్ష (42.22సె.) వ్యక్తిగత అత్యుత్తమ టైమింగ్‌తో రజతం నెగ్గాడు. మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో విత్య (56.53 సె.) చాంపియన్‌గా నిలిచింది. పురుషుల జావెలిన్‌ త్రోలో రోహిత్‌ యాదవ్‌ (74.42మీ.) టైటిల్‌ అందుకున్నాడు. మహిళ 800మీ. పరుగు ఫైనల్లో పూజ (2:02.79 సె.) మీట్‌ రికార్డుతో విజేతగా నిలిచింది. భారత్‌కే చెందిన ట్వింకిల్‌ చౌధరి రజతం నెగ్గింది. పురుషుల 800 మీటర్ల పరుగు ఫైనల్లో కృషన్‌ కుమార్‌ (1:48.46సె.) అగ్రస్థానం చేజిక్కించుకున్నాడు.

మహిళల జావెలిన్‌ త్రోలో 56.82మీ. దూరం ఈటెను విసిరిన అన్నూరాణి టైటిల్‌ దక్కించుకుంది. పురుషుల 4గీ400 మీ. రిలేలో సంతోష్‌, విశాల్‌, ధరమ్‌వీర్‌, మనుతో కూడిన భారత బృందం (3.05.58సె.) మీట్‌ రికార్డుతో టైటిల్‌ కైవసం చేసుకుంది. మహిళల లాంగ్‌జంప్‌లో శైలీసింగ్‌ (6.41మీ.) రజతం, అన్సీ సోజన్‌ (6.39మీ.) కాంస్య పతకం గెలుపొందారు.


ఇవీ చదవండి:

రింకూ కాబోయే భార్య ఎమోషనల్

ఇంగ్లండ్‌కు బుమ్రా భయం

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 09 , 2025 | 05:24 AM