Rinku Singh-Priya Saroj: రింకూను పట్టుకొని ఏడ్చేసిన ప్రియా సరోజ్.. అందరూ చూస్తుండగానే!
ABN , Publish Date - Jun 08 , 2025 | 03:48 PM
టీమిండియా పించ్‌హిట్టర్ రింకూ సింగ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తాజాగా అతడి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. అయితే ఎంగేజ్‌మెంట్‌లో అతడి కాబోయే సతీమణి భావోద్వేగానికి గురైంది. అసలేం జరిగిందంటే..

టీమిండియాలో ఇప్పుడు అంతా బ్యాండ్ బాజా బారాత్ నడుస్తోంది. యువ క్రికెటర్లు ఒక్కొక్కరుగా పెళ్లి బాట పడుతున్నారు. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఇటీవలే ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. చిన్ననాటి స్నేహితురాలు వన్షికతో అతడి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఇది జరిగిన రెండ్రోజులకే మరో భారత స్టార్, పించ్‌హిట్టర్ రింకూ సింగ్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. సమాజ‌్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌తో అతడి నిశ్చితార్థం ఆదివారం ఘనంగా జరిగింది. లక్నోలోని సెంట్రమ్ హోటల్‌లో జరిగిన ఈ వేడుకకు పలువురు క్రికెట్ స్టార్లతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్‌లో ప్రియా సరోజ్ భావోద్వేగానికి లోనైంది. అసలేం జరిగిందంటే..
కన్నీళ్లు ఆపుకుంటూ..
ఎంగేజ్‌మెంట్ ఈవెంట్‌లో ఉంగరాలు మార్చుకున్న తర్వాత రింకూను పట్టుకొని ఏడ్చేసింది ప్రియా సరోజ్. కళ్ల నుంచి ఉబికి వస్తున్న కన్నీళ్లను నియంత్రించేందుకు ప్రయత్నించింది. అయినా కన్నీళ్లు ఆగకపోవడంతో రింకూ చేతిని పట్టుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. నిశ్చితార్థం అయిపోవడంతో సంతోషం పట్టలేక ఆమె ఏడ్చేసిందని అంటున్నారు. అవి కన్నీళ్లు కాదు.. ఆనందభాష్పాలు అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, రింకూ-ప్రియ ఎంగేజ్‌మెంట్ ఈవెంట్‌కు మాజీ క్రికెటర్లు ప్రవీణ్ కుమార్, పీయూష్ చావ్లాతో పాటు ఉత్తర్‌ప్రదేశ్ రంజీ టీమ్ కెప్టెన్ ఆర్యన్ జుయల్ హాజరయ్యారు. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, ఎంపీ డింపుల్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ప్రొఫెసర్ రామ్ గోపాల్, బీసీసీఐ వైస్ సెక్రెటరీ రాజీవ్ శుక్లా కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సంవత్సరం నవంబర్ 18న వారణాసిలో రింకూ-ప్రియ పెళ్లి జరగనుంది.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి