Shubhman Gill: టీమిండియా 587 ఆలౌట్.. శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ
ABN, Publish Date - Jul 03 , 2025 | 09:28 PM
టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలి డబుల్ సెంచరీతో అలరించడంతో ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులకు ఆలౌటైంది
టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) తొలి డబుల్ సెంచరీతో అలరించడంతో ఇంగ్లండ్‌తో ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులకు ఆలౌటైంది (Ind vs Eng). కెప్టెన్ గిల్ ఎంతో ఓర్పు, సంయమనంతో చూడ చక్కని ఇన్నింగ్స్ ఆడి భారీ స్కోరుకు బాటలు వేశాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు (Shubhman Gill Record).
అసలు సిసలైన టెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన గిల్ 387 బంతుల్లో 30 ఫోర్లు, మూడు సిక్స్‌లతో 269 పరుగుల భారీ స్కోరు సాధించాడు. టెస్ట్‌ల్లో డబుల్ సెంచరీ సాధించడం గిల్‌కు ఇదే తొలిసారి. ఇంగ్లండ్‌లో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారత కెప్టెన్‌గా గిల్ నిలిచాడు. గిల్‌తో పాటు రవీంద్ర జడేజా (89), యశస్వి జైస్వాల్ (87) కీలక పరుగులు చేశారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ (42) గిల్‌తో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో టీమిండియా 151 ఓవర్లలో 587 పరుగులు సాధించింది.
ఇంగ్లండ్ బౌలర్లలో స్పిన్నర్ షోయబ్ బషీర్ మూడు వికెట్లు పడగొట్టాడు. క్రిస్ వోక్స్, జాష్ టంగ్ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ ఒక్కో వికెట్ పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించడంతో ఈ మ్యాచ్‌పై భారత్ పట్టు బిగించినట్టే కనిపిస్తోంది. ఇంగ్లండ్ బ్యాటర్లు దీటుగా స్పందిస్తే ఈ మ్యాచ్ డ్రాగా ముగుస్తుంది. భారత్ బౌలర్లు చెలరేగితే టీమిండియా గెలుపు ఖాయం. ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలవ్వాలంటే కచ్చితంగా అద్భుతం జరగాల్సిందే.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 03 , 2025 | 09:28 PM