నెలకు రూ 4 లక్షలు చెల్లించాలి
ABN, Publish Date - Jul 02 , 2025 | 05:23 AM
విడాకుల కేసులో టీమిండియా ఆటగాడు మహ్మద్ షమికి హైకోర్టులో గట్టిఎదురుదెబ్బ తగిలింది. నిర్వహణ ఖర్చుల కింద మాజీ భార్య...
విడాకుల కేసులో షమికి హైకోర్టు ఆదేశం
కోల్‌కతా: విడాకుల కేసులో టీమిండియా ఆటగాడు మహ్మద్ షమికి హైకోర్టులో గట్టిఎదురుదెబ్బ తగిలింది. నిర్వహణ ఖర్చుల కింద మాజీ భార్య హసీన్ జహా, కుమార్తెకు కలిపి నెలకు రూ. 4 లక్షలు చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పింది. ఇందులో హసీన్‌కు రూ. 1.5 లక్షలు, కూతురికి రూ. 2.50 లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది. జిల్లా కోర్టు జహాకు రూ. 50 వేలు, అతడి కూతురుకు రూ. 80 వేలు చెల్లించాలని తీర్పు నిచ్చింది. దీన్ని జహా హైకోర్టులో సవాల్ చేసింది.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 02 , 2025 | 05:23 AM