Share News

India vs England: బౌలర్లతో ఊహించని ప్రయోగం.. ఇక ఇంగ్లండ్ ఖేల్ ఖతం!

ABN , Publish Date - Jul 01 , 2025 | 02:15 PM

ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ కోసం వినూత్న ప్రయోగం చేస్తోంది టీమిండియా. ఇంగ్లండ్‌ను ఓడించేందుకు బౌలర్లను ప్రధాన ఆయుధంగా మలచుకునే పనిలో పడింది.

India vs England: బౌలర్లతో ఊహించని ప్రయోగం.. ఇక ఇంగ్లండ్ ఖేల్ ఖతం!
IND vs ENG

లీడ్స్ టెస్ట్‌లో భారత ఓటమికి బౌలర్ల వైఫల్యం కారణమని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. బ్యాటర్ల నుంచి ఏకంగా 5 సెంచరీలు నమోదయ్యాయి. మిడిలార్డర్ మినహాయిస్తే రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ మిగతా టీమిండియా బ్యాటర్లు చెలరేగి ఆడారు. పరుగుల వరద పారించారు. కానీ బౌలర్లు మాత్రం ఇంగ్లండ్‌ను రెండుసార్లు ఆలౌట్ చేయలేకపోయారు. దీంతో గిల్ సేనకు పరాభవం తప్పలేదు. అయితే ఓటమితో విమర్శలు మూటగట్టుకున్న బౌలర్లనే ప్రధాన ఆయుధంగా వాడాలని హెడ్ కోచ్ గౌతం గంభీర్ డిసైడ్ అయ్యాడని తెలుస్తోంది. అందులో భాగంగానే వాళ్లతో నూతన ప్రయోగం చేస్తున్నాడట. మరి.. ఆ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం..


బ్యాట్ పట్టి..

ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగే రెండో టెస్ట్‌కు ముందు భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను మరింత బలోపేతం చేస్తున్నాడు గంభీర్. ఓపెనర్ల దగ్గర నుంచి ఫినిషర్ల వరకు సాలిడ్ బ్యాటర్లు ఉన్నా.. బౌలర్లూ బ్యాట్లతో విరుచుకుపడేలా ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్‌తో నెట్ సెషన్‌లో ప్రత్యేకంగా చాలా సేపు బ్యాటింగ్ సాధన చేయిస్తున్నాడు. దీనికి సంబంధించిన స్పెషల్ వీడియోను అభిమానులతో పంచుకుంది బీసీసీఐ. ఇందులో భారత బౌలింగ్ దళం మొత్తం బ్యాటింగ్ చేస్తూ కనిపించారు.


బాదాల్సిందే..

‘నేను ఏ స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతానో అక్కడ కొన్ని పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. మ్యాచ్ పరిస్థితులు, అవతలి వైపు క్రీజులో ఉన్న బ్యాటర్‌ను దృష్టిలో పెట్టుకొని ఆడాలని అనుకుంటున్నా. కనీసం 20 నుంచి 40 పరుగులు చేస్తే జట్టుకు చాలా ప్లస్ అవుతుందని భావిస్తున్నా’ అని ఆకాశ్‌దీప్ చెప్పుకొచ్చాడు. స్కోరు బోర్డుపై సాధ్యమైనంత ఎక్కువ పరుగుల్ని జత చేయాలని కోరుకుంటున్నానని సిరాజ్ తెలిపాడు. బ్యాటింగ్‌లో తన వంతు కృషి చేస్తానని మరో పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ అన్నాడు. ఇది చూసిన నెటిజన్స్.. టెయిలెండర్లతోనూ పరుగులు రాబట్టేందుకు భారత్ ప్రయోగం చేస్తోందని అంటున్నారు. స్కోరు బోర్డుపై ఎక్కువ పరుగులు ఉంటే బంతిని గట్టిగా బాదగల ఆకాశ్‌దీప్, బుమ్రాకు బ్యాటింగ్‌లో ప్రమోషన్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని చెబుతున్నారు. బౌలర్లతో ఈ లెవల్‌లో ప్రాక్టీస్ చేయించడం చాలా అరుదని.. దీనికి గట్స్ ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు.


ఇవీ చదవండి:

మనసులు గెలుచుకున్న కావ్యా పాప

ప్లేయింగ్ 11తో బిగ్ షాక్!

బుమ్రా విషయంలో బేఫికర్

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 01 , 2025 | 02:15 PM