విశాఖ ఇండస్ర్టీస్ కేసులో హెచ్‌సీఏకు ఎదురుదెబ్బ
ABN, Publish Date - Jun 27 , 2025 | 05:58 AM
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో వ్యాపార ప్రకటనల హక్కులకు సంబంధించి విశాఖ ఇండస్ర్టీ్‌సతో జరిగిన ఒప్పందం విషయంలో హైదరాబాద్ క్రికెట్ సంఘానికి...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో వ్యాపార ప్రకటనల హక్కులకు సంబంధించి విశాఖ ఇండస్ర్టీ్‌సతో జరిగిన ఒప్పందం విషయంలో హైదరాబాద్ క్రికెట్ సంఘానికి (హెచ్‌సీఏ) ఎదురుదెబ్బ తగిలింది. విశాఖ ఇండస్ర్టీస్‌తో జరిగిన ఒప్పందాన్ని అమలు చేయనందుకు హెచ్‌సీఏ రూ.25 92 కోట్లు చెల్లించాలని, ఈ మొత్తం చెల్లించే వరకు 18 శాతం వడ్డీ లెక్కగట్టాలని అర్బిట్రేషన్ అవార్డు జారీ అయింది. ఈ అవార్డును హెచ్‌సీఏ 2016లో కమర్షియల్ కోర్టులో సవాల్ చేయగా 2024లో కమర్షియల్ కోర్టు హెచ్‌సీఏ పిటిషన్‌ను కొట్టేసింది. కమర్షియల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హెచ్‌సీఏ హైకోర్టులో అప్పీల్ చేసింది. కాగా హైకోర్టులో సైతం హెచ్‌సీఏకు ఎదురుదెబ్బ తగిలింది. హెచ్‌సీఏకు వ్యతిరేకంగా జారీ అయిన అర్బిట్రేషన్ అవార్డును హైకోర్టు సమర్థించింది. హెచ్‌సీఏ ఏ దశలోనూ న్యాయబద్ధంగా ఆట ఆడలేదని.. కనీసం అవార్డుకు సంబంధించిన చట్టబద్ధమైన సెక్యూరిటీ డిపాజిట్ కూడా చేయలేదని హైకోర్టు తప్పుబట్టింది. హెచ్‌సీఏ క్రీడాస్ఫూర్తిలేని తన అసలు రంగును బయటపెట్టిందని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 27 , 2025 | 05:58 AM