Share News

Jasprit Bumrah: బుమ్రా గాలి తీసిన సంజన.. ఇంత మాట అనేసిందేంటి భయ్యా?

ABN , Publish Date - Jun 26 , 2025 | 06:19 PM

భారత జట్టు ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మరో సవాల్‌కు సిద్ధమవుతున్నాడు. లీడ్స్ టెస్ట్‌లో టీమిండియాను ఓటమి బారి నుంచి కాపాడలేకపోయిన పేసుగుర్రం.. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్ పని పట్టాలని చూస్తున్నాడు.

Jasprit Bumrah: బుమ్రా గాలి తీసిన సంజన.. ఇంత మాట అనేసిందేంటి భయ్యా?
Jasprit Bumrah

ఇంగ్లండ్ టెస్ట్‌లో భారత్‌ను ఓటమి బారి నుంచి గట్టెక్కించలేకపోయాడు జస్‌ప్రీత్ బుమ్రా. గాయం నుంచి కోలుకొని ఇటీవలే రీఎంట్రీ ఇచ్చిన పేసుగుర్రం.. జట్టు విజయం కోసం ఎంతో శ్రమించాడు. ఇంజ్యురీ తిరగబెడుతుందనే భయం ఉన్నప్పటికీ ఏకంగా 45 ఓవర్లు బౌలింగ్ చేశాడు బుమ్రా. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి ఏస్ పేసర్.. రెండో ఇన్నింగ్స్‌లో బ్రేక్‌త్రూ అందించకున్నా ప్రభావవంతంగా బౌలింగ్ చేశాడు. అయినా ఓటమి పలకరించడంతో రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ పని పట్టాలని పంతంతో ఉన్నాడు. ఆతిథ్య జట్టు బ్యాటర్ల బెండు తీయాలని చూస్తున్నాడు. ఈ తరుణంలో బుమ్రా సతీమణి సంజనా గణేశన్ అతడి గాలి తీసేసింది. ఇంతకీ ఆమె ఏం చేసిందో ఇప్పుడు చూద్దాం..


బుమ్రాతో అవ్వదంటూ..

టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అతడి భార్య గీతా బస్రాతో కలసి హూజ్ ద బాస్ అనే షో నిర్వహిస్తున్నాడు. ఇందులో ప్రముఖ క్రికెటర్లను ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఇదే క్రమంలో తాజాగా బుమ్రా-సంజనతో సరదాగా సంభాషించారు భజ్జీ-గీత దంపతులు. ఇందులో భాగంగా కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితంలోని పలు విశేషాలను పంచుకున్నారు బుమ్రా-సంజన. అయితే ఫుల్ ఎంటర్‌టైనింగ్‌గా సాగిన ఈ షోలో బుమ్రా గాలి తీసేసింది సంజన. తనతో పరిగెత్తడం అతడి వల్ల కాదంటూ నవ్వులు పూయించింది. ఆమె దెబ్బకు ఏస్ పేసర్ బిత్తరపోయాడు.


ఆ ఒక్క డైలాగ్‌తో..

‘ఒక సందర్భంలో ఓ పనిని పరిగెత్తి చేద్దామని బుమ్రా అన్నాడు. అయితే నువ్వు రన్నింగ్ చేస్తే అవ్వదని చెప్పా. ఎందుకంటే రనప్‌ సమయంలోనే బుమ్రా సరిగ్గా పరిగెత్తడు. అలాంటిది ఇప్పుడు నాతో ఎలా పరిగెత్తుతాడు అంటూ ఆటపట్టించా’ అని సంజన చెప్పుకొచ్చింది. సంజన ఈ డైలాగ్ చెప్పగానే బుమ్రా ముఖం వాడిపోయింది. ఆ తర్వాత సంజనతో పాటు భజ్జీ జోకులు వేయడంతో తిరిగి మామూలు అయిపోయాడు బుమ్రా. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఇవీ చదవండి:

మాట తప్పిన గిల్-గంభీర్

జైస్వాల్‌ను బద్నాం చేయొద్దు

ఆస్పత్రి బెడ్‌పై సూర్యకుమార్

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 26 , 2025 | 06:25 PM