Yashasvi Jaiswal: జైస్వాల్‌ను బద్నాం చేయొద్దు.. ఫీల్డింగ్ కోచ్ వార్నింగ్!
ABN , Publish Date - Jun 26 , 2025 | 04:22 PM
టీమిండియా యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ మీద భారీ ఎత్తున విమర్శలు వస్తున్నాయి. భారత జట్టు కొంపముంచాడంటూ అతడ్ని అంతా ఏకిపారేస్తున్నారు.

భారత జట్టు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ భారీగా విమర్శల్ని మూటగట్టుకుంటున్నాడు. లీడ్స్ టెస్ట్‌లో అతడు చేసిన నిర్వాకంపై విమర్శకులే కాదు.. మాజీ క్రికెటర్లు, అభిమానులు కూడా సీరియస్ అవుతున్నారు. భారత జట్టు కొంపముంచాడంటూ అతడ్ని దుయ్యబడుతున్నారు. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 4 క్యాచులు డ్రాప్ చేయడం ద్వారా తొలి టెస్ట్‌లో భారత జట్టును ముంచేశాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత చెత్త ఫీల్డింగ్ చేసేవాళ్లను టీమ్‌లోకి ఎందుకు తీసుకుంటారంటూ ఏకిపారేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెన్ ఇన్ బ్లూ మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ స్పందించాడు. జైస్వాల్‌కు అతడు అండగా నిలిచాడు. మరి.. శ్రీధర్ ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..
విమర్శించడం సులువు..
తీవ్ర ఒత్తిడి ఉండే అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటివి జరుగుతుంటాయని, జైస్వాల్‌ను బద్నాం చేయడం సరికాదన్నాడు ఆర్ శ్రీధర్. ‘జైస్వాల్ అద్భుతమైన ఫీల్డర్. గల్లీలో అతడి క్యాచింగ్ సూపర్బ్‌గా ఉంటుంది. అతడు ఫీల్డింగ్‌లో పెద్దగా తప్పులు చేయడు. కానీ రెండు మ్యాచులు మాత్రం భిన్నంగా సాగాయి. మెల్‌బోర్న్‌తో పాటు లీడ్స్ టెస్ట్‌లో జైస్వాల్‌కు ఏదీ కలసిరాలేదు. బంగ్లాదేశ్‌తో పాటు కాన్పూర్ టెస్ట్‌లో అతడు స్టన్నింగ్ క్యాచెస్ అందుకున్నాడు. కామెంట్రీ బాక్స్‌లో కూర్చొని విమర్శలు చేయడం చాలా సులువు. కానీ ఆటగాళ్లు కఠిన పరిస్థితుల్లో ఉన్నారనేది అర్థం చేసుకోవాలి. భారత జట్టులోని చాలా మంది ప్లేయర్లకు ఇది తొలి ఇంగ్లండ్ పర్యటన అని గుర్తుంచుకోవాలి’ అని శ్రీధర్ చెప్పుకొచ్చాడు.
అదే దెబ్బకొట్టింది..
జైస్వాల్ తప్పులు చేశాడనే ముందు గతంలో అతడి ఫీల్డింగ్ ప్రదర్శనల్ని ఒకసారి గుర్తుచేసుకోవాలని ఆర్ శ్రీధర్ పేర్కొన్నాడు. అయితే లీడ్స్ టెస్ట్‌లో ఓవరాల్‌గా భారత ఫీల్డింగ్ బాగోలేదన్నాడు మాజీ ఫీల్డింగ్ కోచ్. ఈ మ్యాచ్‌లో టీమిండియా గ్రౌండ్ ఫీల్డింగ్ సరిగ్గా లేదన్నాడు ఆర్ శ్రీధర్. క్యాచులు పట్టడం వేరే విషయమని.. కానీ గ్రౌండ్ ఫీల్డింగ్‌లో విఫలమవడం అర్థం కావడం లేదన్నాడు. మిస్ ఫీల్డింగ్ వల్ల చాలా పరుగులు వదిలేశారని, ఇది రిజల్ట్‌పై ప్రభావం చూపిందన్నాడు.
ఇవీ చదవండి:
పంత్ 7 కెరీర్ అత్యుత్తమ ర్యాంక్
బుమ్రాకు విశ్రాంతి.. నిజమేనా..
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి