Eng Vs India: హ్యారీ బ్రూక్ సూపర్ సెంచరీ.. విజయం దిశగా ఇంగ్లండ్..
ABN, Publish Date - Aug 03 , 2025 | 08:03 PM
ప్రస్తుతం ఓవల్ మైదానంలో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం దిశగా సాగుతోంది (Ind vs Eng). బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై హ్యారీ బ్రూక్ (94 నాటౌట్), జో రూట్ (78 నాటౌట్) క్రీజులో పాతుకుపోయి వేగంగా పరుగులు చేస్తున్నారు.
ప్రస్తుతం ఓవల్ మైదానంలో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం దిశగా సాగుతోంది (Ind vs Eng). బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై హ్యారీ బ్రూక్ (103 నాటౌట్), జో రూట్ (78 నాటౌట్) క్రీజులో పాతుకుపోయి వేగంగా పరుగులు చేస్తున్నారు. ఇంగ్లండ్ ఎదుట టీమిండియా 374 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆ భారీ లక్ష్యానికి ఇంగ్లండ్ సునాయాసంగా చేరవవుతోంది. చివరి రోజు ఆరంభంలో రెండు వికెట్లు పడగొట్టి సంతోషంలో మునిగిన టీమిండియాకు బ్రూక్, రూట్ షాకిచ్చారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు అజేయంగా 180 పరుగులు జోడించారు.
టీమిండియా బౌలర్లను సునాయాసంగా ఎదుర్కొంటూ ఇంగ్లండ్ బ్యాటర్లు బ్రూక్, రూట్ వేగంగా పరుగులు చేస్తున్నారు. ముఖ్యంగా హ్యారీ బ్రూక్ వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తున్నాడు. కేవలం 91 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. అందులో 12 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. ఇక, మరోవైపు టెస్ట్ స్పెషలిస్ట్ జో రూట్ తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. రూట్ 122 బంతుల్లో 78 పరుగులతో ఆడుతున్నాడు. వీరిద్దరూ వికెట్ల పతనాన్ని అడ్డుకోవడమే కాకుండా వేగంగా పరుగులు చేస్తూ టీమిండియా గెలుపు ఆశలపై నీళ్లు జల్లారు.
ప్రస్తుతానికి ఇంగ్లండ్ 61 ఓవర్లలో 286 పరుగులు చేసింది. విజయానికి మరో 88 పరుగుల దూరంలో ఉంది. ఈ జోడీని విడదీయడానికి టీమిండియా కెప్టెన్ గిల్ బౌలర్లను మారుస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ పరుగుల వేగం మాత్రం తగ్గడం లేదు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలుపు దాదాపు ఖాయమైనట్టే కనిపిస్తోంది. ఈ మ్యాచ్ ఇంగ్లండ్ గెలిస్తే సిరీస్‌ను 3-1తో చేజిక్కించుకుంటుంది.
ఇవి కూడా చదవండి..
గిల్ మాస్టర్‌ప్లాన్.. చివరి ఓవర్లో క్రాలీని సిరాజ్ ఎలా బౌల్డ్ చేశాడో చూడండి..
ఇది క్రీడా పోటీనా..భారత్-పాక్ మ్యాచ్‌పై ప్రియాంక చతుర్వేది ఆగ్రహం
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Aug 03 , 2025 | 08:03 PM