ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

India Badminton Team: భారత షట్లర్లకు సులువైన డ్రా

ABN, Publish Date - Aug 09 , 2025 | 03:43 AM

భారత బ్యాడ్మింటన్‌ జట్టుకు ప్రపంచ జూనియర్‌ టీమ్‌ చాంపియన్‌షి్‌పలో సులువైన డ్రా ఎదురైంది.

న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్‌ జట్టుకు ప్రపంచ జూనియర్‌ టీమ్‌ చాంపియన్‌షి్‌పలో సులువైన డ్రా ఎదురైంది. హాంకాంగ్‌, నేపాల్‌, ఘనాలాంటి పసికూన జట్లతో కలిపి భారత్‌కు గ్రూప్‌-హెచ్‌లో చోటు దక్కింది. భారత్‌ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీ వచ్చే అక్టోబరు 6 నుంచి 11 వరకు అసోం రాజధాని గువాహటిలో జరగనుంది. మొత్తం 37 జట్లు 8 గ్రూపులుగా విడిపోయి తలపడనున్నాయి. ప్రతి గ్రూప్‌లో విజేతగా నిలిచిన జట్టు క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. టోర్నీ టాప్‌సీడ్‌ థాయ్‌లాండ్‌ గ్రూప్‌-ఎలో డెన్మార్క్‌, స్లోవేనియా, కుక్‌ ఐలాండ్‌ జట్లతో కలిసి తలపడనుంది. ప్రతి జట్టు పురుషులు, మహిళల సింగిల్స్‌, పురుషులు, మహిళల డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది.

Updated Date - Aug 09 , 2025 | 03:43 AM