ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Dhruv Jurel: ధ్రువ్ జురెల్ ఉంటే గెలుపు ఖాయమా? టీమిండియాకు ధ్రువ్ ఉంటే కలిసొస్తోందా..

ABN, Publish Date - Aug 07 , 2025 | 11:15 AM

తాజాగా టీమిండియా ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం ఇంగ్లండ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో యువ భారత జట్టు ఇంగ్లండ్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. అంచనాలకు మించి రాణించి సిరీస్‌ను డ్రా చేసుకుంది.

Dhruv Jurel

టీమిండియా యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. విజయవంతమైన టెస్ట్ ఆటగాడిగా నిలిచాడు. తాజాగా టీమిండియా ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం ఇంగ్లండ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే (Ind vs Eng). శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో యువ భారత జట్టు ఇంగ్లండ్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. అంచనాలకు మించి రాణించి సిరీస్‌ను డ్రా చేసుకుంది. ముఖ్యంగా ఉత్కంఠగా జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా గెలుపు చాలా మందిని ఆకట్టుకుంది.

ఆ మ్యాచ్‌లో ఆడిన ధ్రువ్ జురెల్ టీమిండియాకు లక్ ఫ్యాక్టర్‌గా మారాడట. అంతేకాదు ఓ అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ధ్రువ్ జురెల్ టీమిండియా తరఫున ఇప్పటివరకు ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. ఆ ఐదు మ్యాచ్‌ల్లోనూ టీమిండియానే విజయం సాధించడం విశేషం. ధ్రువ్ జురెల్ తన టెస్ట్ కెరీర్‌లో ఇప్పటివరకు ఒక్క ఓటమి కూడా చవిచూడలేదు. వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ ఆల్డిన్ బాప్టిస్ట్ తన టెస్ట్ కెరీర్‌లో వరుసగా 10 టెస్ట్ మ్యాచ్‌లు ఆడితే అన్నింటిలో ఆ జట్టు గెలిపొందింది.

బౌలింగ్ ఆల్ రౌండర్ అయిన బాప్టిస్ట్ తన కెరీ‌ర్‌లో పదే టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. ఆ మ్యాచ్‌లన్నింటిలోనూ వెస్టిండీస్ జట్టే గెలుపొందింది. బాప్టిస్ట్ తర్వాత ఆ రికార్డు జురెల్ పేరిటే ఉండడం గమనార్హం. 2024లో టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేసిన జురెల్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 36.42 సగటుతో 255 పరుగులు చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. అలాగే వికెట్ కీపర్‌గా 9 క్యాచ్‌లు పట్టి, 2 స్టంపింగ్‌లు చేశాడు.

ఇవి కూడా చదవండి..

గిల్ మాస్టర్‌ప్లాన్.. చివరి ఓవర్లో క్రాలీని సిరాజ్ ఎలా బౌల్డ్ చేశాడో చూడండి..


ఇది క్రీడా పోటీనా..భారత్-పాక్ మ్యాచ్‌పై ప్రియాంక చతుర్వేది ఆగ్రహం


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 07 , 2025 | 11:15 AM