ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పంజాబ్‌కు పంచ్‌

ABN, Publish Date - May 25 , 2025 | 05:25 AM

టాప్‌-2లో నిలిచేందుకు పోటీపడుతున్న జట్లకు వరుసగా మూడో రోజూ ప్రతికూల ఫలితమే ఎదురైంది. గుజరాత్‌, బెంగళూరు తరహాలోనే తాజాగా పంజాబ్‌ కింగ్స్‌కు పంచ్‌ పడింది. ఇప్పటికే ప్లేఆఫ్స్‌ నుంచి తప్పుకొన్న ఢిల్లీ క్యాపిటల్స్‌...

నేటి మ్యాచ్‌లు

గుజరాత్‌ X చెన్నై

వేదిక: అహ్మదాబాద్‌, మ.3.30 నుంచి

హైదరాబాద్‌ X కోల్‌కతా

వేదిక: ఢిల్లీ : రా.7.30 నుంచి

విజయంతో ఢిల్లీ బైబై

  • రాణించిన సమీర్‌ రిజ్వీ

  • ముస్తాఫిజుర్‌కు 3 వికెట్లు

జైపూర్‌: టాప్‌-2లో నిలిచేందుకు పోటీపడుతున్న జట్లకు వరుసగా మూడో రోజూ ప్రతికూల ఫలితమే ఎదురైంది. గుజరాత్‌, బెంగళూరు తరహాలోనే తాజాగా పంజాబ్‌ కింగ్స్‌కు పంచ్‌ పడింది. ఇప్పటికే ప్లేఆఫ్స్‌ నుంచి తప్పుకొన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో అదరగొట్టింది. అగ్రస్థానంపై కన్నేసిన పంజాబ్‌పై శనివారం జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో నెగ్గింది. తద్వారా 15 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. భారీ ఛేదనలో సమీర్‌ రిజ్వీ (25 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 58 నాటౌట్‌) అజేయ అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 206 పరుగులు చేసింది. శ్రేయాస్‌ అయ్యర్‌ (34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 53), స్టొయినిస్‌ (16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 44 నాటౌట్‌), ఇన్‌గ్లి్‌స (12 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 32) రాణించారు. ముస్తాఫిజుర్‌కు 3.. విప్రజ్‌, కుల్దీ్‌పలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో ఢిల్లీ 19.3 ఓవర్లలో 4 వికెట్లకు 208 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు రాహుల్‌ (35), డుప్లెసి (23) తొలి వికెట్‌కు 55 పరుగులు జోడించారు. ఆ తర్వాత కరుణ్‌ నాయర్‌ (44) భారీ షాట్లతో విరుచుకుపడగా.. డెత్‌ ఓవర్లలో సమీర్‌ రిజ్వీ పంజాబ్‌ బౌలర్లను ఆడుకున్నాడు. అతడికి స్టబ్స్‌ (18 నాటౌట్‌) సహకరించడంతో ఢిల్లీ ఎలాంటి ఒత్తిడికి గురికాలేదు. చివరి ఓవర్‌లో 8 పరుగులే అవసరమవగా, రిజ్వీ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. హర్‌ప్రీత్‌కు రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా సమీర్‌ రిజ్వీ నిలిచాడు.


స్టొయినిస్‌ ధనాధన్‌: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ శ్రేయాస్‌ నిలకడతో పాటు ఆఖర్లో స్టొయినిస్‌ జోరుతో జట్టు 200 దాటింది. ఓపెనర్‌ ప్రియాన్ష్‌ (6) విఫలమైనా ప్రభ్‌సిమ్రన్‌-ఇన్‌గ్లి్‌స జోడీ చెలరేగింది. ఆరో ఓవర్‌లో 6,4 బాది ఇన్‌గ్లి్‌స అవుటైనా పవర్‌ప్లేలో జట్టు 60/2 స్కోరు సాధించింది. రెండో వికెట్‌కు వీరు 47 పరుగులు జత చేశారు. విప్రజ్‌ బౌలింగ్‌లో స్కూప్‌ షాట్‌కు వెళ్లి ప్రభ్‌సిమ్రన్‌ బౌల్డయ్యాక ఆటలో కాస్త వేగం తగ్గింది. అయితే శ్రేయాస్‌ అర్ధసెంచరీతో జట్టును ఆదుకున్నాడు. నేహల్‌ (16), శశాంక్‌ (11) విఫలమైనా కెప్టెన్‌కు స్టొయినిస్‌ సహకరించాడు. 17వ ఓవర్‌లో అతడి 6,6,4.. శ్రేయాస్‌ 4తో 25 పరుగులు వచ్చాయి. కానీ కుల్దీప్‌ ఒకే ఓవర్‌లో శ్రేయాస్‌, అజ్మతుల్లా (1) వికెట్లు తీశాడు. అయినా 19వ ఓవర్‌లో మరోసారి చెలరేగిన స్టొయినిస్‌ 6,4,4,6తో 22 రన్స్‌ రాబట్టాడు. ముస్తాఫిజుర్‌ ఆఖరి ఓవర్‌లో పది పరుగులే ఇచ్చి జాన్సెన్‌ (0)ను అవుట్‌ చేశాడు.

స్కోరుబోర్డు

పంజాబ్‌: ప్రియాన్ష్‌ (సి) స్టబ్స్‌ (బి) ముస్తాఫిజుర్‌ 6, ప్రభ్‌సిమ్రన్‌ (బి) విప్రజ్‌ 28, ఇంగ్లిస్‌ (స్టంప్డ్‌) స్టబ్స్‌ (బి) విప్రజ్‌ 32, శ్రేయాస్‌ (సి) మోహిత్‌ (బి) కుల్దీప్‌ 53, నేహల్‌ (సి) డుప్లెసి (బి) ముకేశ్‌ 16, శశాంక్‌ (సి) స్టబ్స్‌ (బి) ముస్తాఫిజుర్‌ 11, స్టొయినిస్‌ (నాటౌట్‌) 44, అజ్మతుల్లా (సి) రిజ్వీ (బి) కుల్దీప్‌ 1, జాన్సెన్‌ (సి) స్టబ్స్‌ (బి) ముస్తాఫిజుర్‌ 0, హర్‌ప్రీత్‌ (నాటౌట్‌) 7, ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 206/8, వికెట్ల పతనం: 1-8, 2-55, 3-77, 4-118, 5-144, 6-172, 7-174, 8-197; బౌలింగ్‌: ముకేశ్‌ 4-0-49-1, ముస్తాఫిజుర్‌ 4-0-33-3, మోహిత్‌ శర్మ 4-0-47-0, విప్రజ్‌ 4-0-38-2, కుల్దీప్‌ 4-0-39-2.

ఢిల్లీ: రాహుల్‌ (సి) శశాంక్‌ (బి) జాన్సెన్‌ 35, డుప్లెసి (సి) ప్రియాన్ష్‌ (బి) హర్‌ప్రీత్‌ 23, కరుణ్‌ నాయర్‌ (బి) హర్‌ప్రీత్‌ 44, అటల్‌ (సి) అర్ష్‌దీప్‌ (బి) ప్రవీణ్‌ దూబే 22, సమీర్‌ రిజ్వీ (నాటౌట్‌) 58, స్టబ్స్‌ (నాటౌట్‌) 18, ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 19.3 ఓవర్లలో 208/4; వికెట్ల పతనం: 1-55, 2-65, 3-93, 4-155; బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ 4-0-35-0, అజ్మతుల్లా 4-0-46-0, హర్‌ప్రీత్‌ బ్రార్‌ 4-0-41-2, జాన్సెన్‌ 4-0-41-1, ప్రవీణ్‌ దూబే 2-0-20-1, స్టొయినిస్‌ 1.3-0-21-0.


పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

గుజరాత్‌ 13 9 4 0 18 0.602

పంజాబ్‌ 13 8 4 1 17 0.327

బెంగళూరు 13 8 4 1 17 0.255

ముంబై 13 8 5 0 16 1.292

ఢిల్లీ 14 7 6 1 15 0.011

లఖ్‌నవూ 13 6 7 0 12 -0.337

కోల్‌కతా 13 5 6 2 12 0.193

హైదరాబాద్‌ 13 5 7 1 11 -0.737

రాజస్థాన్‌ 14 4 10 0 8 -0.549

చెన్నై 13 3 10 0 6 -1.030

గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;

ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్‌ రన్‌రేట్‌

ఇవీ చదవండి:

బయటపడిన ఆర్సీబీ వీక్‌నెస్

టీమిండియాలోకి ట్రక్ డ్రైవర్ కొడుకు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 25 , 2025 | 05:25 AM