India vs New Zealand Pitch: రెచ్చిపోతున్న స్పిన్నర్లు.. కివీస్‌ను కాచుకోగలమా..
ABN, Publish Date - Mar 09 , 2025 | 04:48 PM
ICC Champions Trophy 2025 Final: టైటిల్ ఫైట్‌లో భారత స్పిన్నర్లు చెలరేగి బౌలింగ్ చేస్తున్నారు. న్యూజిలాండ్ బ్యాటర్లకు మిట్ట మధ్యాహ్నం చుక్కలు చూపిస్తున్నారు కుల్దీప్ అండ్ కో. అయితే ఇదే అంశం టీమిండియాకు నెగెటివ్‌గా మారే ప్రమాదం కూడా ఉంది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్‌లో అనుకున్నదే జరుగుతోంది. దుబాయ్ పిచ్ ఊహించిన విధంగానే పూర్తిగా స్పిన్‌కు అనుకూలిస్తోంది. ఇప్పటిదాకా కివీస్ ఇన్నింగ్స్‌లో పడిన వికెట్లలో అన్నీ స్పిన్నర్లకే పడ్డాయి. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి-రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇన్నింగ్స్ ఆరంభంలో మహ్మద్ షమి-హార్దిక్ పాండ్యాను ప్రత్యర్థి బ్యాటర్లు రచిన్ రవీంద్ర-విల్ యంగ్ ఉతికి ఆరేశారు. దీంతో స్పిన్నర్లను దింపాడు రోహిత్. వాళ్లు బ్యాక్ టు బ్యాక్ వికెట్లు తీస్తూ రచ్చ రచ్చ చేశారు. అయితే ఇదే అంశం ఇప్పుడు భారత్‌ను భయపెడుతోంది. దీని గురించి క్లారిటీగా తెలుసుకుందాం..
మామూలోళ్లేం కాదు..
దుబాయ్ పిచ్ రెండో ఇన్నింగ్స్‌లోనూ స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తుంది. ఒకవేళ అదే జరిగి.. బంతి బాగా టర్న్ అయితే టీమిండియాకు కూడా ఇబ్బందులు తప్పవు. కివీస్ టీమ్‌లో కెప్టెన్ మిచెల్ శాంట్నర్‌తో పాటు రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ రూపంలో క్వాలిటీ స్పిన్నర్లు ఉన్నారు. ముఖ్యంగా శాంట్నర్ చాలా ప్రమాదకారి. భారత్ మీద అతడికి అద్భుతమైన ట్రాక్ రికార్డు కూడా ఉంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీని అతడు పలుమార్లు ఇబ్బందులు పెట్టాడు. రచిన్-ఫిలిప్స్ కూడా తరచూ బంతితో మెరుస్తున్నారు. వీళ్లను కాచుకొని ఛేజ్ చేయడం రోహిత్ సేనకు అంత ఈజీ కాదు. కాబట్టి ఒకవైపు వికెట్లను కాపాడుకుంటూనే మరోవైపు స్ట్రైక్ రొటేషన్, అడపాదడపా భారీ షాట్లు బాదుతూ పోవాలి. మరి.. ఛేదనలో భారత్ ఎలాంటి వ్యూహంతో బరిలోకి దిగుతుందో చూడాలి.
ఇవీ చదవండి:
కివీస్‌కు చుక్కలు చూపిస్తున్న కుల్దీప్
ప్లేయింగ్ 11తో ట్విస్ట్ ఇచ్చిన రోహిత్
తడబడుతున్న కివీస్ బ్యాటర్లు.. స్కోర్ అంచనా ఎంతంటే
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Mar 09 , 2025 | 04:48 PM