Virat Kohli: బెంగళూరు తొక్కిసలాట.. కోహ్లీపై పోలీసులకు ఫిర్యాదు
ABN, Publish Date - Jun 06 , 2025 | 10:39 PM
ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట నేపథ్యంలో కోహ్లీపై కూడా ఫిర్యాదు దాఖలైంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆర్‌సీబీ విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట నేపథ్యంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై ఫిర్యాదు దాఖలైంది. శివమొగ్గ జిల్లాకు చెందిన హెచ్‌ఎమ్ వెంకటేశ్ అనే వ్యక్తి కబ్బన్ పోలీసు స్టేషన్‌లో కోహ్లీపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఇప్పటికే రిజిస్టరైన కేసులో భాగంగా ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇక బుధవారం జరిగిన తొక్కిసలాటలో 11 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. మరో 50 మంది గాయపడ్డారు. ఆర్సీబీ ప్లేయర్లను సత్కరించేందుకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కర్ణాటక ప్రభుత్వానికి అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం, అక్కడి డ్రెయిన్‌పై ఉన్న మూత కూలడంతో జనాల్లో కంగారు బయలుదేరి తొక్కిసలాటకు దారి తీసింది. మృతుల్లో 13 నుంచి 35 ఏళ్ల మధ్య వారు ఉన్నారు.
మరోవైపు, కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు సిటీ కమిషనర్ బీ దయానందతో పాటు పలువురు పోలీసు ఉన్న ఉన్నతాధికారులు సస్పెండ్ చేసింది. అనంతరం, సీమంత్ కుమార్ సింగ్‌ను కొత్త చీఫ్‌గా నియమించింది. ఇక ఆర్సీబీ టీమ్, కేఎస్‌సీఏ, డీఎన్‌ఏ నెట్వర్క్ తోపాటు ఈ ఘటనతో సంబంధం ఉన్న పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సొసాలేని పోలీసులు అరెస్టు చేశారు. డీఎన్ఏ నెట్‌వర్క్‌కు చెందిన ముగ్గురు సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ముంబైకి వెళ్లేందుకు బెంగళూరు ఎయిర్‌పోర్టుకు వచ్చిన సొసాలేను విమానాశ్రయంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ అరెస్టు చట్ట వ్యతిరేకమంటూ సొసాలే కోర్టును ఆశ్రయించారు.
ఇవి కూడా చదవండి:
లండన్‌కు విరాట్, అనుష్క.. మండిపడుతున్న నెటిజన్లు
ఓటమి తట్టుకోలేని కార్ల్‌సన్ రియాక్షన్‌పై గుకేశ్ స్పందన ఇదీ
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 06 , 2025 | 10:45 PM