ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Australia Test Ranking: దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి.. అయినా ఆస్ట్రేలియానే టాప్

ABN, Publish Date - Jun 16 , 2025 | 10:51 AM

దక్షిణాఫ్రికాతో ఓటమి తరువాత కూడా ఆస్ట్రేలియా టెస్టుల్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. తాజాగా ప్రకటించి ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో 123 రేటింగ్ పాయింట్స్‌తో నెం.1గా నిలిచింది.

ICC Test rankings 2025

ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో ఓటమి చవిచూసినా కూడా ఆస్ట్రేలియా తాజా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో తన టాప్ పొజిషన్‌ను నిలబెట్టుకోగలిగింది. 26 మ్యాచుల్లో 123 రేటింగ్‌ పాయింట్స్‌తో నెం.1గా కొనసాగుతోంది. ఇక కంగారూలపై 27 ఏళ్ల తరువాత చారిత్రక విజయం సాధించిన దక్షిణాఫ్రికా తన రేటింగ్ మెరుగు పరుచుకుని రెండో స్థానానికి ఎగబాకింది. 22 మ్యాచుల్లో 114 రేటింగ్ పాయింట్స్‌తో ఇంగ్లండ్‌ను అధిగమించి నెం.2 స్థానాన్ని ఆక్రమించింది. ఇంగ్లండ్ కంటే ఒక్క రేటింగ్ పాయింట్ ఎక్కువగా సాధించడం గమనార్హం. తాజా వరల్ట్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీలో టాప్‌ పోజిషన్‌లో ఉన్న జట్టుపై విజయం సాధించడంతో దక్షిణాఫ్రికాకు మూడు రేటింగ్ పాయింట్స్ దక్కాయి. ఇక దక్షిణాఫ్రికా జూన్ 28 నుంచి జింబాబ్వేతో రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌లో పాల్గొననుంది. జూన్ 25 నుంచి ఆస్ట్రేలియా మూడు మ్యాచుల టెస్ట్ సిరీస్‌ కోసం వెస్టిండీస్‌లో పర్యటిస్తుంది.

ఇక తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ నాలుగో స్థానానికి పరిమితమైంది. న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ కావడంతో, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా చేతిలో కూడా ఓటమి చవి చూడటం జట్టు రేటింగ్స్‌పై ప్రతికూల ప్రభావం చూపించాయి. ఇదిలా ఉంటే, మరో టెస్టు సిరీస్ కోసం భారత్ త్వరలో ఇంగ్లండ్‌కు వెళ్లనుంది. విరాట్, రోహిత్ టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించడంతో టీమిండియాకు యువ కెరటం శుభ్‌మన్ గిల్ నేతృత్వం వహిస్తున్నారు. దీంతో, టీమిండియా ప్రదర్శన ఎలా ఉండబోతోందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. భారత్, ఇంగ్లండ్ మధ్య జూన్ 20 నుంచి ఐదు టెస్టు మ్యాచులు జరగనున్నాయి. వీలైనన్ని విజయాలు సాధించేందుకు ఇరు దేశాలు గట్టి పట్టుదలతో ఉన్నాయి.

ఇక వరల్ట్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. దాదాపు 27 ఏళ్ల తరువాత అపురూపమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఎయిడెన్ మార్క్రమ్ పరుగుల వరద, రబాడా బౌలింగ్ మెరుపులు దక్షిణాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించాయి. టెంబా కూడా జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.

ఇవి కూడా చదవండి:

బుమ్రాతో అలాంటి పని మాత్రం చేయించొద్దు.. టీమిండియాకు గంగూలీ సూచన

అభిమానుల నుంచి అలాంటి ప్రేమ నాకెప్పుడూ దక్కలేదు: నొవాక్ జకోవిచ్

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 16 , 2025 | 11:25 AM