Virat Kohli-Anushka Sharma: విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ సూపర్ డ్యాన్స్.. వీడియో వైరల్
ABN, Publish Date - Apr 19 , 2025 | 10:27 PM
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, అతడి భార్య అనుష్క శర్మ వైవాహిక జీవితం 2017లో మొదలైంది. ఇటలీలో టస్కనీలో 2017 డిసెంబర్‌లో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. అప్పట్నుంచి వీరిద్దరూ సెలబ్రిటీ కపుల్‌గా అందరినీ అలరిస్తూనే ఉన్నారు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli), అతడి భార్య అనుష్క శర్మ (Anushka Sharma) వైవాహిక జీవితం 2017లో మొదలైంది. ఇటలీలో టస్కనీలో 2017 డిసెంబర్‌లో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. అప్పట్నుంచి వీరిద్దరూ సెలబ్రిటీ కపుల్‌గా అందరినీ అలరిస్తూనే ఉన్నారు. వీరికి ఓ కూతురు, కొడుకు ఉన్నారు. వీరికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కోహ్లీకి, అనుష్కకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
తాజాగా కోహ్లీ, అనుష్కకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కోహ్లీ, అనుష్క మరికొందరితో కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. ఆ వీడియోను దుబాయ్‌లో చిత్రీకరించినట్టు తెలుస్తోంది. ఆ వీడియోలో నార్మల్ డ్రెస్స్‌ల్లో ఉన్న కోహ్లీ, అనుష్క గ్రూప్ డ్యాన్స్ చేస్తున్నారు. అయితే ఆ వీడియోను ఎప్పుడు చిత్రీకరించారు అనే సంగతి విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఆ వీడియోను విరాట్ ఫ్యాన్ పేజ్‌లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్ల రూపంలో తమ స్పందనలను తెలియజేస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Apr 19 , 2025 | 10:27 PM