వారెవ్వా ఏం గెలిచాడు
ABN, Publish Date - Jun 09 , 2025 | 05:27 AM
ఉత్కంఠభరితంగా సాగిన ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో నయా స్పెయిన్ బుల్ కార్లోస్ అల్కారజ్ చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం నువ్వా.. నేనా? అనే రీతిలో సాగిన ఈ తుది పోరులో అతడు 4-6, 6-7(4-7), 6-4, 7-6(7-3), 7-6 (10-2)తో వరల్డ్ నెంబర్1 జానిక్ సిన్నర్...
పోరాడి ఓడిన సినర్
5 గంటలా 29 నిమిషాల ఫైనల్..
సూపర్ టైబ్రేక్‌లో అల్కారజ్ విజయం
స్పెయిన్ స్టార్ ఖాతాలో రెండో ఫ్రెంచ్ ఓపెన్
వాట్ ఎ మ్యాచ్.. అల్కారజ్-సిన్నర్‌ల మధ్య జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టేలా చేసింది. ఎవరిది పైచేయో తేల్చుకునేందుకు ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా ఐదు గంటల 29 నిమిషాల పాటు కొదమ సింహాల్లా తలపడిన ఈ వరల్డ్ టాప్-2 ఆటగాళ్లు సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఎన్నెన్నో మలుపుల మధ్య.. ఒకరి గెలుపు అవకాశాలను మరొకరు అడ్డుకుంటూ సాగించిన ఉత్కంఠ సమరంలో చివరకు 21 ఏళ్ల అల్కారజ్ మట్టి కోట రారాజుగా తన టైటిల్‌ను కాపాడుకున్నాడు.
పారిస్: ఉత్కంఠభరితంగా సాగిన ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో నయా స్పెయిన్ బుల్ కార్లోస్ అల్కారజ్ చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం నువ్వా.. నేనా? అనే రీతిలో సాగిన ఈ తుది పోరులో అతడు 4-6, 6-7(4-7), 6-4, 7-6(7-3), 7-6 (10-2)తో వరల్డ్ నెంబర్1 జానిక్ సిన్నర్ (ఇటలీ)ని ఓడించాడు. గతేడాది ఇక్కడ సెమీ్‌సలో సిన్నర్‌ను ఓడించిన అల్కారజ్.. అదే ఊపులో ఆపై తొలి ఫ్రెంచ్ ఓపెన్‌ను అందుకున్నాడు. అలాగే కెరీర్‌లో ఇది ఐదో గ్రాండ్‌స్లామ్. సిన్నర్ 8, అల్కారజ్ 7 ఏస్‌లు సంధించారు.
తొలి రెండు సెట్లు గెలిచి..: ఇద్దరు యువ ఆటగాళ్లే కావడంతో ఒక్కో పాయింట్ కోసం పట్టు వదలకుండా కోర్టులో చిరుతలా కదిలారు. దీంతో తొలి గేమ్ ముగిసేందుకే 12 నిమిషాలు పట్టింది. సిన్నర్ 1-0తో సర్వీస్ కాపాడుకుని శుభారంభం చేయగా.. అటు ప్రేక్షకులు భారీ మద్దతు పలికిన అల్కారజ్ తొలి బ్రేక్ పాయింట్ సాధించి 3-2తో ఆధిక్యం చూపాడు. ఆ తర్వాత సిన్నర్ ఆరో గేమ్‌ను బ్రేక్ చేసి, ఏడో గేమ్‌లో సర్వీస్ కాపాడుకోవడంతో 4-3తో నిలిచాడు. అదే ఊపులో మరో బ్రేక్ పాయింట్‌తో 6-4తో సెట్‌ను సైతం దక్కించుకున్నాడు. ఇక రెండో సెట్‌లో సిన్నర్ పదునైన సర్వీస్, బేస్‌లైన్ ఆటతీరుతో 4-1తో దూసుకెళ్లాడు. అయితే అల్కారజ్ తొమ్మిదో గేమ్‌ను బ్రేక్ చేసి, ఆ తర్వాత సర్వీస్ కాపాడుకుని 5-5 స్కోరుతో ఆసక్తిగా మార్చాడు. ఇద్దరి పట్టుదల కారణంగా సెట్ టైబ్రేక్‌కు వెళ్లినా సిన్నర్ 7-6తో ముగించాడు. మూడో గేమ్‌లో అల్కారజ్ మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. మొదటే తన సర్వీ్‌సను కోల్పోయినా వరుసగా మూడు పాయింట్లతో ఆధిక్యం చూపాడు. ఎలాంటి తడబాటు లేకుండా ఆడి పదో గేమ్‌ను ఫోర్‌హ్యాండ్ విన్నర్‌తో బ్రేక్ చేసి పోటీలో నిలిచాడు. దీంతో సిన్నర్ 31 వరుస గ్రాండ్‌స్లామ్స్ సెట్‌ల విజయానికి బ్రేక్ పడింది.
మూడు మ్యాచ్ పాయింట్లను కాచుకుని...: మరోవైపు గంటా ఏడు నిమిషాలపాటు సాగిన నాలుగో సెట్‌లో ఇద్దరూ తమ సర్వీ్‌సలను నిలుపుకుంటూ ముందుకు సాగారు. ఏడో గేమ్‌ను సిన్నర్ బ్రేక్ చేసిన తర్వాత సర్వీస్ కాపాడుకుని 5-3తో పైచేయి సాధించాడు. కానీ తొమ్మిదో గేమ్‌లో ప్రత్యర్థి అల్కారజ్ మూడు చాంపియన్‌షి్‌ప పాయింట్లను కాచుకోవడం విశేషం. ఈ కీలక సమయంలో పుంజుకున్న అతడు బ్రేక్‌తో పాటు వరుస మూడు పాయింట్లతో 6-5కు వెళ్లడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. కానీ 12వ గేమ్‌లో బ్రేక్ పాయింట్‌తో సిన్నర్ టైబ్రేక్‌కు వెళ్లినా.. ఈ సెట్‌ను 7-6తో అల్కారజ్ నెగ్గాడు.
నిర్ణాయక ఐదో సెట్‌ను అల్కారజ్ బ్రేక్ పాయింట్‌తో ఆరంభించాడు. అనంతరం పదో గేమ్‌లో ప్రత్యర్థి చాంపియన్‌షి్‌ప సర్వీ్‌సను బ్రేక్ చేసి, తర్వాత మరో పాయింట్‌తో సిన్నర్ 6-5తో పోటీలోకి వచ్చాడు. కానీ సిన్నర్ సర్వీ్‌సను బ్రేక్ చేసి అల్కారజ్ టైబ్రేక్‌కు తీసుకెళ్లాడు. ఇక్కడ ఒత్తిడికి లోనుకాకుండా వరుస పాయింట్లతో అల్కారజ్ 7-6 (10-2)తో మ్యాచ్‌ను ముగించాడు.
1
ఫ్రెంచ్ ఓపెన్‌లో అత్యంత సుదీర్ఘంగా (5 గంటల 29 నిమిషాలు) సాగిన ఫైనల్ మ్యాచ్ ఇదే. ఓవరాల్ గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో ఇది రెండోది. 2012లో జొకో-నడాల్ మధ్య ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ 5 గంటలా 53 నిమిషాల పాటు సాగింది.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 09 , 2025 | 05:27 AM