అహ్మదాబాద్‌లో ఫైనల్
ABN, Publish Date - May 21 , 2025 | 03:45 AM
ఐపీఎల్ ప్లేఆఫ్స్ వేదికలను మంగళవారం బీసీసీఐ ప్రకటించింది. దీంట్లో భాగంగా జూన్3న జరిగే ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరుగుతుంది. దీనికి ముందు జూన్ ఒకటిన జరిగే క్వాలిఫయర్ 2 కూడా....
క్వాలిఫయర్2 కూడా..
ముల్లన్‌పూర్‌లో ఎలిమినేటర్
ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్
న్యూఢిల్లీ: ఐపీఎల్ ప్లేఆఫ్స్ వేదికలను మంగళవారం బీసీసీఐ ప్రకటించింది. దీంట్లో భాగంగా జూన్3న జరిగే ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరుగుతుంది. దీనికి ముందు జూన్ ఒకటిన జరిగే క్వాలిఫయర్ 2 కూడా ఇక్కడే నిర్వహించనున్నారు. అలాగే క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్‌లు న్యూ చండీగఢ్‌కు సమీపంలోని ముల్లన్‌పూర్ నూతన స్టేడియంలో జరుగనున్నాయి. టాప్-2 జట్లు ఆడే క్వాలిఫయర్1లో విజేత నేరుగా ఫైనల్‌కు చేరే విషయం తెలిసిందే. అయితే ప్లేఆఫ్స్‌లో ఈ నాలుగు మ్యాచ్‌లు కూడా గత షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్, కోల్‌కతాలో జరగాల్సింది. కానీ ప్రయాణ సమస్యలు, వాతావరణ పరిస్థితుల వల్ల వేదికలను మార్చారు. కాగా ఐపీఎల్ ఫైనల్‌కు అత్యధికంగా మూడోసారి ఆతిథ్యమివ్వనున్న అహ్మదాబాద్ సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఆర్‌సీబీ మ్యాచ్ లఖ్‌నవూలో..: బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆర్‌సీబీ తమ సొంత వేదికను మార్చింది. చిన్నస్వామి స్టేడియంలో ఈనెల 23న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే అదే రోజున లఖ్‌నవూ వేదికగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి.
2 గంటల ఎక్స్‌ట్రా టైమ్
ఈ సీజన్ ఐపీఎల్‌లో జరగబోయే మిగిలిన అన్ని లీగ్ మ్యాచ్‌లకు మరో గంట అదనపు సమయం కేటాయించారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని బీసీసీఐ ప్రకటించింది. ఏవైనా అవాంతరాలు ఏర్పడితే మ్యాచ్ నిర్వహణ కోసం మామూలుగానైతే లీగ్ మ్యాచ్‌లకు గంట, ప్లే ఆఫ్స్‌కు 2 గంటల ఎక్స్‌ట్రా టైమ్ ఉంటుంది. అయితే ఈ సీజన్‌లోని మిగిలిన 9 లీగ్ మ్యాచ్‌లకు కూడా రెండు గంటల సమయాన్ని కేటాయిస్తున్నట్టు బోర్డు తెలిపింది. ఇది మంగళవారం జరిగిన చెన్నై-రాజస్థాన్ మ్యాచ్‌నుంచే అమల్లోకి వచ్చింది. దీంతో భారీ వర్షం కురిసినా మ్యాచ్‌లు ఆడించేందుకు మరో గంట వేచిచూసే వీలుంటుంది.
ప్లేఆఫ్స్ షెడ్యూల్
తేదీ మ్యాచ్ వేదిక
మే 29 క్వాలిఫయర్-1 ముల్లన్‌పూర్
మే 30 ఎలిమినేటర్ ముల్లన్‌పూర్
జూన్ 1 క్వాలిఫయర్-2 అహ్మదాబాద్
జూన్ 3 ఫైనల్ అహ్మదాబాద్
ఇవి కూడా చదవండి..
IPL 2025 CSK vs RR: రాణించిన ఆయుష్, బ్రేవిస్.. రాజస్తాన్ రాయల్స్ టార్గెట్ ఎంతంటే
Preity zinta hugs Vaibhav: వైభవ్ సూర్యవంశీకి హగ్.. ప్రీతి జింటా స్పందన ఏంటంటే
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 21 , 2025 | 03:45 AM