IPL 2025 CSK vs RR: రాణించిన ఆయుష్, బ్రేవిస్.. రాజస్తాన్ రాయల్స్ టార్గెట్ ఎంతంటే
ABN , Publish Date - May 20 , 2025 | 09:21 PM
బ్యాటర్లు సమష్టిగా రాణించడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మెరుగైన స్కోరు సాధించింది. ఆరంభంలో బాగానే ఆడినప్పటికీ చివర్లో వేగంగా పరుగులు చేయలేకపోవడంతో 200 పరుగులను చేరుకోలేకపోయింది. చివర్లో రాజస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.
బ్యాటర్లు సమష్టిగా రాణించడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మెరుగైన స్కోరు సాధించింది. ఆరంభంలో బాగానే ఆడినప్పటికీ చివర్లో వేగంగా పరుగులు చేయలేకపోవడంతో 200 పరుగులను చేరుకోలేకపోయింది. చివర్లో రాజస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో చెన్నై టెయిలెండర్లు పరుగులు చేయడానికి ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ రోజు రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి (RR vs CSK).
టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో చెన్నై టీమ్ బ్యాటింగ్‌కు దిగింది. 12 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయిన చెన్నైను ఓపెనర్ ఆయుష్ మాత్రే (43) ఆదుకున్నాడు. మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మిడిలార్డర్‌లో బ్రేవిస్ (42), శివమ్ దూబే (39) కీలక పరుగులు చేశారు. చివర్లో రాజస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ధోనీ (16) పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది.
రాజస్తాన్ ముందు 188 పరుగుల విజయ లక్ష్యాన్ని ఇచ్చింది. రాజస్తాన్ బౌలర్లలో యుద్వీర్ సింగ్, ఆకాశ్ మద్వాల్ మూడేసి వికెట్లు తీశారు. మరి, ఈ టార్గెట్‌ను రాజస్తాన్ ఎలా ఛేజ్ చేస్తుందో చూడాలి. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంటుంది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..