US Open 2025: 45 ఏళ్ల వీన్‌సకు వైల్డ్‌కార్డ్
ABN, Publish Date - Aug 15 , 2025 | 06:19 AM
లేటు వయసులో యూఎస్ ఓపెన్ సింగిల్స్ వైల్డ్‌కార్డ్ అందుకొన్న ప్లేయర్‌గా అమెరికా వెటరన్ వీనస్ విలియమ్స్ (45) రికార్డులకెక్కింది...
న్యూయార్క్: లేటు వయసులో యూఎస్ ఓపెన్ సింగిల్స్ వైల్డ్‌కార్డ్ అందుకొన్న ప్లేయర్‌గా అమెరికా వెటరన్ వీనస్ విలియమ్స్ (45) రికార్డులకెక్కింది. ఈ నెల 24 నుంచి జరగనున్న యూఎస్ ఓపెన్‌కు సంబంధించిన వైల్డ్‌కార్డ్ ఎంట్రీలను నిర్వాహకులు ప్రకటించారు. రెండేళ్ల విరామం తర్వాత వీనస్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ బరిలోకి దిగనుంది. ఈ క్రమంలో 1981లో రెనీ రిచర్డ్స్ (47) తర్వాత సింగిల్స్ వైల్డ్‌కార్డ్ అందుకొన్న పెద్ద వయసు ప్లేయర్‌గా విలియమ్స్ నిలిచింది. పురుషుల సింగిల్స్‌లో భారత సంతతికి చెందిన అమెరికా ఆటగాడు నిశేష్ బసవారెడ్డి (20)కి కూడా వైల్డ్‌కార్డ్ లభించింది. నెల్లూరు జిల్లాకు చెందిన నిశేష్ తండ్రి...మురళీకృష్ణ 1999లో అమెరికా వెళ్లి స్థిరపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్..
సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ
For More AndhraPradesh News And Telugu News
Updated Date - Aug 15 , 2025 | 06:19 AM