ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

First Test Century: సచిన్‌ తొలి శతకానికి 35 ఏళ్లు

ABN, Publish Date - Aug 15 , 2025 | 06:22 AM

ముంబై: సచిన్‌ టెండూల్కర్‌..24 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్‌ కెరీర్‌లో నెలకొల్పిన రికార్డులు ఎన్నో..అందుకున్న ఘనతలు మరెన్నో.. 664 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 34,357 పరుగులు, 100 సెంచరీలు. ఈ శతకాలకు...

మధుర జ్ఞాపకం

ముంబై: సచిన్‌ టెండూల్కర్‌..24 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్‌ కెరీర్‌లో నెలకొల్పిన రికార్డులు ఎన్నో..అందుకున్న ఘనతలు మరెన్నో.. 664 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 34,357 పరుగులు, 100 సెంచరీలు. ఈ శతకాలకు పునాది పడింది 35 ఏళ్ల కిందట..1990 ఆగస్టు 14న ఓల్డ్‌ట్రాఫర్డ్‌ మైదానంలో. తొలి సెంచరీ ఏ క్రికెటర్‌కైనా ఎంతో అపురూపం. పైగా..ఆ శతకం జట్టును ఓటమి కోరలనుంచి తప్పించినదైతే ఆ థ్రిల్లే వేరు కదా! ఇంగ్లండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీ్‌సలో భాగంగా ఓల్డ్‌ట్రాఫోర్డ్‌ రెండో టెస్ట్‌కు వేదికైంది. ఆ టెస్ట్‌ సచిన్‌కు తొమ్మిదవది. ఆ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 68 పరుగులు చేసిన 17 ఏళ్ల టెండూల్కర్‌..408 పరుగుల లక్ష్యంతో చివరి రోజు 103/4తో జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దశలో ఆరో నెంబర్‌లో క్రీజులోకి వచ్చాడు. బంతి రివ్వుమని దూసుకొస్తూ బ్యాటర్లకు దడ పుట్టిస్తోంది. ఈ తరుణంలో దుర్భేద్యమైన డిఫెన్స్‌ ఆటతో ఇంగ్లండ్‌ బౌలర్లకు ఎదురొడ్డాడు. ఓ పక్క సహచరులు అవుటవుతున్నా వెరవలేదు. చూడముచ్చటైన బౌండరీలతో ఆకట్టుకొని సెంచరీ సాధించిన సచిన్‌ (189 బంతుల్లో 17 ఫోర్లతో 119 నాటౌట్‌) మనోజ్‌ ప్రభాకర్‌ (67 నాటౌట్‌) జతగా మ్యాచ్‌ను డ్రా (343/6) చేయగలిగాడు.

ఈ వార్తలు కూడా చదవండి..

పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్..

సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 15 , 2025 | 06:22 AM