ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఫ్రెండ్ అని చూడకుండా ఎంత దారుణంగా ప్రవర్తించారు..

ABN, Publish Date - May 19 , 2025 | 07:14 PM

Viral Video: విచక్షణా రహితంగా మత్రిని చావగొట్టారు. అతడ్ని రోడ్డుపై బరబరా ఈడ్చుకెళ్లారు. ఆపడానికి ప్రయత్నించిన ఓ మహిళను పక్కకు తోసేశారు. రోడ్డుపై ఈడ్చుకెళ్లటంతో మత్రికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఎముకలు కూడా విరిగాయి.

Viral Video

అన్ని అనర్థాలకు కోపం కారణం అని అందరికీ తెలుసు. తెలిసినా కూడా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక దారుణాలకు పాల్పడుతుంటారు. కోపం కారణంగా బంధాలు సైతం దెబ్బతింటున్నాయి. భార్యాభర్తలు, మిత్రులు.. ఆఖరికి కన్నవాళ్లకు బిడ్డలకు మధ్య కూడా గొడవలు జరుగుతున్నాయి. తాజాగా, ఓ ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన గొడవ దారుణానికి దారి తీసింది. తనను కొట్టాడన్న కోపంతో ఓ యువకుడు తన మిత్రుడితో అత్యంత ఘోరంగా ప్రవర్తించాడు. ఎముకలు విరిగేంతలా దాడి చేశాడు.


ఈ సంఘటన మధ్య ప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. గ్వాలియర్‌లోని సేవా నగర్‌కు చెందిన మత్రి, బంటీ యాదవ్ స్నేహితులు. కొద్దిరోజుల క్రితం ఇద్దరూ బాగా తాగి గొడవపడ్డారు. గొడవ సందర్భంగా మత్రి, బంటీని కొట్టాడు. దీంతో ఆగ్రహానికి గురైన బంటీ అక్కడినుంచి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత తన సోదరుడు, స్నేహితులతో కలిసి అక్కడి వచ్చాడు. వారంతా కలిసి మత్రిపై దాడికి దిగారు.


విచక్షణా రహితంగా మత్రిని చావగొట్టారు. అతడ్ని రోడ్డుపై బరబరా ఈడ్చుకెళ్లారు. ఆపడానికి ప్రయత్నించిన ఓ మహిళను పక్కకు తోసేశారు. రోడ్డుపై ఈడ్చుకెళ్లటంతో మత్రికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఎముకలు కూడా విరిగాయి. కుటుంబసభ్యులు గాయపడ్డ అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దాడిపై మత్రి కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బంటీ కూడా మత్రిపై కేసు పెట్టాడు. తనపై కత్తితో దాడి చేశాడని ఫిర్యాదు చేశాడు. రెండు వర్గాల తరపున కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి

Minister Kandula Durgesh: నంది అవార్డులపై మంత్రి దుర్గేష్ కీలక ప్రకటన

Mumbai Shocker: ఇలాంటి తల్లి ఎవ్వరికీ ఉండకూడదు.. మరీ నీచంగా..

Updated Date - May 19 , 2025 | 07:50 PM