ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: రోడ్డుపై బీరు పంచిన యువకులు.. ఇది ఊహించలేదు..

ABN, Publish Date - Jun 11 , 2025 | 01:55 PM

Rajasthan Viral Video: పప్పు సచిన్ రోడ్డుపై బీరు పంచిన రోజు హిందూ పండుగ ఏకాదశి కావటంతో సోషల్ మీడియాలో గొడవ మొదలైంది. నెటిజన్లు అతడిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

Rajasthan Viral Video

సోషల్ మీడియాలో పాపులర్ అవ్వటం కోసం కొంతమంది చేసే పనులు చూస్తుంటే నవ్వొస్తుంది. కొన్ని సార్లు కోపం కూడా వస్తుంది. తాజాగా, కొంతమంది యువకులు సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని రోడ్డుపై వెళ్లే వారికి బీరు పంచారు. వాహనాల్లో వెళుతున్న వారిని ఆపి మరీ గ్లాసుల్లో బీరు పోసిచ్చారు. కట్ చేస్తే ఆ యువకులందరూ భారీ మూల్యం చెల్లించుకున్నారు. చేసిన తప్పుకు జైలు పాలయ్యారు. ఈ సంఘటన రాజస్థాన్‌లోని జైపూర్‌లో చోటుచేసుకుంది.

సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్లోని జైపూర్‌కు చెందిన పప్పు సచిన్‌కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అతడు తన ఫాలోవర్స్‌ను ఆకర్షించడానికి వింత వింత పనులు చేస్తూ ఉంటాడు. జూన్ 6వ తేదీన తన మిత్రులతో కలిసి జైపూర్‌లోని ఓ రోడ్డు మీదకు వచ్చాడు. రోడ్డుపై వెళుతున్న పాదచారులకు, వాహనదారులకు బీరు పంచాడు. వాహనాలు ఆపి మరీ గ్లాసుల్లో బీరు పోసి ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

పప్పు సచిన్ రోడ్డుపై బీరు పంచిన రోజు హిందూ పండుగ ఏకాదశి కావటంతో సోషల్ మీడియాలో గొడవ మొదలైంది. నెటిజన్లు అతడిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. పండుగ రోజు అలా ఎలా చేస్తావంటూ అతడిపై మండిపడ్డారు. అతడిపై చర్యలు తీసుకోవాలంటూ ట్రాఫిక్ పోలీసులకు విజ్ణప్తి చేశారు. ఈ వీడియో పోలీసు అధికారుల దృష్టికి కూడా వెళ్లింది. పోలీసులు వారందరినీ అదుపులోకీ తీసుకున్నారు. వారితో ‘ఇలాంటి తప్పు ఎప్పుడూ చేయం. మీరు కూడా చేయకండి’అని చెప్పించి వీడియో చిత్రీకరించారు. ఆ వీడియో కూడా ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Updated Date - Jun 11 , 2025 | 04:43 PM