ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సిగ్నల్‌ పడితేనే వీధిలోకి ప్రవేశం

ABN, Publish Date - Jun 15 , 2025 | 02:00 PM

ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్‌ సాఫీగా సాగేందుకు సిగ్నల్స్‌ ఏర్పాటు చేయడం తెలుసు. కానీ ఇరుకిరుకు గల్లీల్లో మనుషులు వెళ్లేందుకు సిగ్నల్స్‌ను ఏర్పాటు చేయడం ఎక్కడైనా చూశారా? అలాంటి సిగ్నల్స్‌ చెక్‌ రిపబ్లిక్‌లోని ప్రేగ్‌ నగరానికి సమీపంలో ఉన్న పురాతన ప్రాంతమైన మాలాస్ట్రానాలో కనిపిస్తాయి.

ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్‌ సాఫీగా సాగేందుకు సిగ్నల్స్‌ ఏర్పాటు చేయడం తెలుసు. కానీ ఇరుకిరుకు గల్లీల్లో మనుషులు వెళ్లేందుకు సిగ్నల్స్‌ను ఏర్పాటు చేయడం ఎక్కడైనా చూశారా? అలాంటి సిగ్నల్స్‌ చెక్‌ రిపబ్లిక్‌లోని ప్రేగ్‌ నగరానికి సమీపంలో ఉన్న పురాతన ప్రాంతమైన మాలాస్ట్రానాలో కనిపిస్తాయి. విచిత్రం ఏమిటంటే... ఈ ఇరుకు గల్లీలే ఆ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా మార్చాయి.

ట్రాఫిక్‌ సిగ్నల్‌ను పట్టించుకోకుండా వెళ్లే వారిని చూస్తూనే ఉంటాం. కానీ మాలాస్ట్రానాలో ఉన్న ‘న్యారో స్ట్రీట్‌’ సిగ్నల్స్‌ను అతిక్రమిస్తే ఇరుక్కుపోవడం ఖాయం. అందుకే బుద్ధిగా గ్రీన్‌ సిగ్నల్‌ పడ్డాకే ఆ ఇరుకైన గల్లీలో నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే అది ఒక్క వ్యక్తి మాత్రమే వెళ్లగలిగేంత ఇరుకుగా ఉంటుంది మరి. పొరపాటున ఎదురుగా మరో మనిషి వస్తే ఇక అంతే... ఇద్దరిలో ఎవరో ఒకరు వెనక్కి అలాగే (తిరిగేందుకు కూడా అవకాశం ఉండదు) వెళ్లాల్సి ఉంటుంది. ఆ ఇబ్బంది రాకూడదనే గల్లీల ముందు సిగ్నల్స్‌ ఏర్పాటు చేశారు.

ఎరక్కపోతే ఇరుక్కుపోవడమే...

ఒక్కో వీధి 32 నుంచి 40 అడుగుల పొడవు ఉంటాయి. వెడల్పు మాత్రం 19 అంగుళాలు మాత్రమే ఉంటాయి. అంటే ఒక వ్యక్తి అతికష్టం మీద అందులో నుంచి వెళ్లవచ్చు. ఎవరైనా కాస్త లావుగా ఉంటే ఇబ్బందే. అలాంటి ఇరుకైన వీధులు అక్కడ చాలానే ఉన్నాయి. వీధి ప్రారంభంలోనే సిగ్నల్‌ బటన్‌ గోడకు బిగించి ఉంటుంది. ఆ ఇరుకు సందులో నుంచి వెళ్లాలనుకుంటున్న వ్యక్తి బటన్‌ నొక్కితే గ్రీన్‌ సిగ్నల్‌ వెలుగుతుంది. అదే సమయంలో అవతలి వైపు నుంచి ఎవరూ రాకుండా రెడ్‌ సిగ్నల్‌ పడుతుంది. ఒకే సమయంలో రెండువైపుల నుంచి వ్యక్తులు ప్రవేశించకుండా ఈ సిగ్నల్‌ ఉపయోగపడుతుంది.

గ్రీన్‌ సిగ్నల్‌ పడ్డాకే ఎవరైనా వీధిలో నుంచి వెళుతుంటారు. మొదటి అంతస్తులో ఉన్న ఒక రెస్టారెంట్‌కు వెళ్లడానికి కూడా ఇరుకైన మెట్ల దారి ఉంది. ‘‘ఒకసారి మా రెస్టారెంట్‌కు వచ్చిన జర్మన్‌ పర్యాటకురాలు దారి మధ్యలో ఇరుక్కుపోయింది. ముందుకు గానీ, వెనక్కి గానీ వెళ్లలేకపోయింది. అతికష్టం మీద మా సిబ్బంది సహాయంతో బయటకు తీసుకువచ్చాం’’ అని సెర్టోవ్కా రెస్టారెంట్‌ యజమాని గుర్తుచేస్తారు. ఈ వీధులను చూసేందుకు పెద్దసంఖ్యలో పర్యాటకులు అక్కడకు వెళ్తుంటారు. పర్యాటకులను ఆకర్షించేందుకే సిగ్నల్స్‌ ఏర్పాటు చేశారని అనే వారు కూడా ఉన్నారు. ఏదైతేనేం... ఈ ప్రత్యేకతతోనే ఆ వీధులు పాపులర్‌ అయ్యాయి.

Updated Date - Jun 15 , 2025 | 02:00 PM