Firing saree for reel: ఇలాంటి వాళ్లనేం చేయాలి.. రీల్ కోసం చీర అంటించుకుని డ్యాన్స్..
ABN, Publish Date - Aug 10 , 2025 | 01:16 PM
ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రజాదరణ పొందాలనే ఆత్రుత ఎంతగా పెరిగిపోయిందంటే, ప్రజలు తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రమాదంలో పడేస్తున్నారు. ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. ఈ జాబితాలో అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రజాదరణ పొందాలనే ఆత్రుత ఎంతగా పెరిగిపోయిందంటే, ప్రజలు తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రమాదంలో పడేస్తున్నారు. ప్రమాదకర విన్యాసాలు (Dangerous Stunts) చేస్తున్నారు. ఈ జాబితాలో అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ మహిళ తన రీల్ (Reel)ను వైరల్ చేయడానికి కట్టుకున్న చీరకు నిప్పంటించుకుంది (saree fire dance). ఆ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
@more_fun_007 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. తెల్ల చీర కట్టుకున్న ఓ మహిళ తన చీర పైటకు నిప్పంటించుకుంది. చీర మండుతుండగానే ఆమె డ్యాన్స్ చేస్తోంది. పైటను అటూ ఇటూ తిప్పుతూ స్టెప్పులు వేసింది. పక్కనే నిలబడి ఉన్న ఒక వ్యక్తి ఈ ప్రమాదకరమైన చర్యను కెమెరాలో బంధించాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను వేల మంది వీక్షించారు.
ఆ వైరల్ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చి వాళ్లు తప్ప ఇలాంటి పని ఎవరు చేస్తారు బ్రదర్ అని ఒక వ్యక్తి వ్యాఖ్యానించారు. లైక్‌లు, వ్యూస్ కోసం ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారని మరొకరు కామెంట్ చేశారు. సరదాగా చేసే ఈ చిన్న తప్పు పెద్ద ప్రమాదానికి దారి తీయవచ్చని మరొకరు పేర్కొన్నారు. సోషల్ మీడియాను గుడ్డిగా అనుసరించడం కొన్నిసార్లు ప్రాణాంతకం కాగలదనడానికి ఈ వీడియో నిదర్శనమని మరొకరు అన్నారు.
ఇవి కూడా చదవండి..
ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఒకేసారి రెండు కప్పలను మింగిన పాము పరిస్థితి చూడండి..
ఈ మంచులో కుక్క ఎక్కడుందో 20 సెకెన్లలో కనిపెడితే.. మీ కళ్లకు తిరుగులేదు..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Aug 10 , 2025 | 03:44 PM