ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వామ్మో.. పాము ఎంత భయపెట్టింది.. జనాల మధ్యలో పాము ఏం చేసిందో చూడండి..

ABN, Publish Date - Jun 17 , 2025 | 05:17 PM

ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పాము అంటేనే భయపడతారు. పాము ఉందని తెలిస్తే అటు వైపు వెళ్లడానికి కూడా వణికిపోతారు. ఇక, పాము మనం ఉన్న వైపే నేరుగా వచ్చేస్తుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. తాజాగా ఓ జలపాతం దగ్గర స్నానం చేస్తున్న జనాలకు అలాంటి అనుభవమే ఎదురైంది.

Snake Viral Video

ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పాము (Snake) అంటేనే భయపడతారు. పాము ఉందని తెలిస్తే అటు వైపు వెళ్లడానికి కూడా వణికిపోతారు. ఇక, పాము మనం ఉన్న వైపే నేరుగా వచ్చేస్తుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. తాజాగా ఓ జలపాతం (Kempty Waterfalls) దగ్గర స్నానం చేస్తున్న జనాలకు అలాంటి అనుభవమే ఎదురైంది. దీంతో వారి గుండెలు అదిరిపోయాయి. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ (Viral Video) అవుతోంది.

parveen9614 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ముస్సోరికి సమీపంలో ఉన్న కెంప్టీ జలపాత దగ్గర చాలా మంది జనాలు సరదాగా స్నానాలు చేస్తున్నారు. ఆ సమయంలో దాదాపు ఆరడుగులు ఉన్న ఓ పాము అక్కడకు వచ్చింది. ఆ పామును చూసిన జనాలు అందరూ కేకలు వేశారు. దీంతో ఆ పాము మరింత గందరగోళానికి గురైంది. అది మరింత వేగంగా జనాలు ఉన్న వైపు నీటిలో ఈదుకుంటూ వెళ్లింది. దీంతో వారందరూ ఒకరినొకరు తోసుకుంటూ తమను తాము కాపాడుకోవడానికి పరుగులు పెట్టారు.

ఆ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు ఐదు లక్షల మంది వీక్షించారు. 31 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. అది వీఐపీ ఎంట్రీ అని ఒకరు కామెంట్ చేశారు. వారిని చూసి ఆ పాము భయపడుతోంది అని మరొకరు పేర్కొన్నారు. ఆ పాము తనను తాను కాపాడుకోవడానికి ఎంత వేగంగా ఈత కొడుతోందో అని మరొకరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి..

Optical Illusion Test: మీ చూపు షార్ప్ అయితే.. ఈ గదిలో పిల్లి ఎక్కడుందో 11 సెకెన్లలో కనిపెట్టండి

Viral Video: ఇలాంటి తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తాయో.. బావిలో పడిన బంతిని ఎలా తీశారో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 17 , 2025 | 05:17 PM