Leopard attacks Crocodile: ఇది చిరుతకే సాధ్యం.. నీటిలోని మొసలిపై ఎలా ఎటాక్ చేసిందో చూడండి..
ABN, Publish Date - Jul 10 , 2025 | 01:54 PM
నీటిలోని మొసలి నోటికి చిక్కితే ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. అయితే అలాంటి మొసలికి ఓ చిరుత పులి చుక్కలు చూపించింది. నీటిలోకి దూకి మరీ మొసలిని మట్టుబెట్టింది. ఆ థ్రిల్లింగ్ హంటింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నీటిలోని మొసలి (Crocodile) అత్యంత బలమైన జంతువు. నీటిలో ఉన్న మొసలి బలం ముందు అంతటి ఏనుగు కూడా బలహీనంగా మారిపోతుంది. నీటిలోని మొసలి నోటికి చిక్కితే ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. అయితే అలాంటి మొసలికి ఓ చిరుత పులి (Leopard) చుక్కలు చూపించింది. నీటిలోకి దూకి మరీ మొసలిని మట్టుబెట్టింది. ఆ థ్రిల్లింగ్ హంటింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు (Leopard attacks Crocodile).
joaobiologo అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. అడవిలోని ఓ చెరువు ఒడ్డున ఓ చెట్టు ఉంది. చెరువులో మొసలి ఉంది. ఆ చెట్టు మీదకు ఎక్కిన చిరుతకు ఆ మొసలి కనిపించింది. వెంటనే ఆ చెట్టు మీద నుంచి నీటిలోకి దూకిన చిరుత ఆ మొసలిపై దాడికి దిగింది. నీటి అడుగుకు వెళ్లిపోయి మొసలిని ముప్పుతిప్పలు పెట్టింది. చివరకు దానిని చంపేసి ఒడ్డు మీదకు వెళ్లిపోయింది. నీటిలోని మొసలిని చంపడం అంటే సాధారణ విషయం కాదు. దీనిని బట్టి చిరుత సామర్థ్యం అర్థమవుతోంది. ఆ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు కోటి మంది వీక్షించారు. దాదాపు 3.5 లక్షల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఆ చిరుత అంతసేపు నీటిలోపల ఉండి శ్వాసను నియంత్రించుకోవడం చాలా గొప్ప విషయం అని ఒకరు కామెంట్ చేశారు. ఆ వీడియోలోని చిరుత చాలా పెద్దగా ఉందని, అది వేటాడిన మొసలి చిన్న పిల్లలా ఉందని మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
తిమింగలాలు ఒకప్పుడు భూమిపై నడిచేవా? ఈజిప్ట్‌లో బయటపడిన తిమింగళం భారీ అస్థిపంజరం..
మీ చూపు షార్ప్ అయితే.. ఈ ఫొటోలో పిల్లి ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jul 10 , 2025 | 01:54 PM