Viral Video: వార్నీ.. డబ్బులు ఇలా కూడా సంపాదించవచ్చా.. ఈ కుర్రాళ్లు ఏం చేస్తున్నారో చూడండి
ABN, Publish Date - May 12 , 2025 | 09:16 AM
తెలివితేటలు ఉండాలే గానీ డబ్బులు సంపాదించడానికి బోలెడు మార్గాలున్నాయి. ఎక్కువ మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కొందరు దానిని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. తెలివిగా ఆలోచించి ఆ సమస్యను తమ ఉపాధిగా మార్చుకుంటారు. అలాంటి వాళ్లకు మనదేశంలో కొదవ లేదు.
తెలివితేటలు (Intelligence) ఉండాలే గానీ డబ్బులు (Money) సంపాదించడానికి బోలెడు మార్గాలున్నాయి. ఎక్కువ మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కొందరు దానిని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. తెలివిగా ఆలోచించి ఆ సమస్యను తమ ఉపాధిగా మార్చుకుంటారు. అలాంటి వాళ్లకు మనదేశంలో కొదవ లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. ఆ వీడియోలోని ఇద్దరు కుర్రాళ్లు వినూత్నంగా డబ్బులు సంపాదిస్తున్నారు (Viral Video).
studentgyaan అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆ వీడియోను పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు డివైడర్ దగ్గర నిలబడి, డివైడర్ దాటడానికి ప్రజలకు సహాయం చేయడం ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు. నిజానికి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ చాలా ఎత్తుగా ఉంది. దానిని దాటాలంటే నిచ్చెన కావాల్సిందే. దాంతో ఇద్దరు కుర్రాళ్లు అక్కడకు నిచ్చెన పట్టుకొచ్చి ప్రజలకు సహాయం చేస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. ముందుగా డబ్బులు తీసుకుని వారిని డివైడర్ దాటిస్తున్నారు.
ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు ఆరు లక్షల మందికి పైగా వీక్షించారు. 6 లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఇది అద్భుతమైన వ్యాపారం అని ఒకరు, తెలివి ఉంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయి అని మరొకరు కామెంట్ చేశారు.
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 12 , 2025 | 09:16 AM