ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Shocking Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. అమెజాన్ అడవుల్లో అనకొండ ఎలా వెళ్తోందో చూశారా

ABN, Publish Date - May 12 , 2025 | 01:15 PM

ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది పాములంటే భయపడతారు. పాములున్నాయని తెలిస్తే అటు వైపు కూడా వెళ్లరు. ఇక, కొండచిలువలను చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. ఇక, పాములలో అతి పెద్దవైన అనకొండ పేరు వింటే చాలు గుండెలు అదిరిపోతాయి.

World largest Anaconda in Amazon forest

ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది పాములంటే (Snakes) భయపడతారు. పాములున్నాయని తెలిస్తే అటు వైపు కూడా వెళ్లరు. ఇక, కొండచిలువలను చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. ఇక, పాములలో అతి పెద్దవైన అనకొండ పేరు వింటే చాలు గుండెలు అదిరిపోతాయి. ఈ భూమి మీదే అతిపెద్ద అనకొండ (Anaconda)ను కొన్ని రోజుల క్రితం ఈక్వెడార్‌లో కనుగొన్నారు. తాజాగా అమెజాన్ అడవుల్లో (Amazon forest) మరో భారీ అనకొండ కనిపించింది.


అమెజాన్ అడవుల మధ్యనున్న నదిలో ఆ అనకొండ ఈదుకుంటూ వెళ్తోంది. @Sheetal2242 అనే మహిళ తన ఎక్స్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోను హెలీకాఫ్టర్ నుంచి చిత్రీకరించారు. అమెజాన్ అడవుల మధ్యనున్న నదిలో ఆ అనకొండ ఈదుకుంటూ వెళ్తోంది. దూరం నుంచే చూస్తుంటేనే ఆ అనకొండ చాలా భారీగా కనిపిస్తోంది. అది వేగంగా నీటిపై ఈదుకుంటూ వెళ్తోంది. దాని భారీ ఆకారాన్ని చూస్తే ఎంతటి వారైనా భయపడి తీరాల్సిందే.


ఆ వీడియోను చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 8.3 లక్షల మందికి పైగా వీక్షించారు. 13 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. అద్భుతమైన వీడియో అని ఒకరు, ఇది అత్యంత భారీ అనకొండలా ఉందని ఇంకొకరు, హాలీవుడ్ సినిమా చూస్తున్నట్టు ఉందని మరొకరు కామెంట్ చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: వార్నీ.. డబ్బులు ఇలా కూడా సంపాదించవచ్చా.. ఈ కుర్రాళ్లు ఏం చేస్తున్నారో చూడండి


Optical Illusion Test: మీ కళ్లు, బ్రెయిన్ షార్ప్ అయితే.. ఈ చెట్టు మీద మూడు కుందేళ్లను కనుక్కోండి చూద్దాం


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 12 , 2025 | 01:15 PM