ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Monkey Viral Video: కోతితో పెట్టుకుంటే అలాగే ఉంటుంది.. ఆ కుర్రాడి పరిస్థితి ఏమైందంటే..

ABN, Publish Date - Jul 14 , 2025 | 02:06 PM

కోతులను చాలా మంది తేలికగా తీసుకుంటారు. అవి ఏమీ చేయవులే అనుకుని లైట్ తీసుకుంటారు. అయితే కోతులకు కోపం వస్తే ఎలా ఉంటుందో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే అర్థమవుతుంది.

Monkey on Bike

జంతువులు ఎప్పుడు, ఎలా ప్రవర్తిస్తాయో ఎవ్వరూ చెప్పలేరు. వాటితోటి ఆటలాడితే తగిన మూల్యం చెల్లించక తప్పదు. ముఖ్యంగా కోతులను (Monkey) చాలా మంది తేలికగా తీసుకుంటారు. అవి ఏమీ చేయవులే అనుకుని లైట్ తీసుకుంటారు. అయితే కోతులకు కోపం వస్తే ఎలా ఉంటుందో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే అర్థమవుతుంది. కోతి‌ని లైట్ తీసుకున్నఓ కుర్రాడు జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే పాఠం నేర్చుకున్నాడు.

@PalsSkit అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ కుర్రాడి బైక్ (Bike) హ్యాండిల్‌ మీద ఓ కోతి కూర్చుని ఉంది. ఆ కుర్రాడు కోతే కదా అని లైట్ తీసుకుని బైక్ ఎక్కి ముందుకు పోనిచ్చాడు. కాసేపు శాంతంగానే కూర్చున్న కోతి ఆ తర్వాత తన నైజం చూపించింది. పైకి లేచి ఆ కుర్రాడి నోటిని గట్టిగా కొరికేసింది. దీంతో ఆ కుర్రాడి పెదవులకు గాయం అయినట్టు తెలుస్తోంది. ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేల మంది ఆ వీడియోను వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఆ కుర్రాడు ఇక ఎప్పటికీ కోతుల జోలికి వెళ్లడని ఒకరు కామెంట్ చేశారు. ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే పాఠం అని మరొకరు పేర్కొన్నారు. జంతువులతో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని మరొకరు సూచించారు.

ఇవి కూడా చదవండి..

వామ్మో.. ఆ కుర్రాళ్లకు భయం లేదా.. భారీ కొండచిలువ పక్కనే ఉంటే..

మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ ఫొటోలో 998ల మధ్య 993 ఎక్కడుందో 6 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 14 , 2025 | 02:06 PM