ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: మరీ ఇంత దారుణమా.. శవాలను కూడా వదలరా..

ABN, Publish Date - Apr 20 , 2025 | 12:49 PM

UP Ward Boy Viral Video: వార్డ్ బాయ్ విజయ్ చెప్పిన దాన్ని పోలీసులు నమ్మలేదు. ఆస్పత్రి అధికారులను అడిగి సీసీటీవీ ఫుటేజీలను పరీక్షించారు. అందులో విజయ్ ఏం చేశాడో మొత్తం రికార్డు అయి ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

UP Ward Boy Viral Video

మానవత్వం మంట గలుస్తోంది. మనుషులు మంచి, చెడుల విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. డబ్బు కోసం నానా గడ్డి తింటున్నారు. ఎంతటి దారుణాలకైనా తెగిస్తున్నారు. తాజాగా, మన మనసు కలిచి వేసే సంఘటన ఒకటి ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఓ వార్డు బాయ్ చనిపోయిన మహిళ శవం నుంచి బంగారాన్ని దొంగిలించాడు. సీసీటీవీ కెమెరాల్లో ఇందుకు సంబంధించిన దృశ్యాలు రికార్డవ్వటంతో విషయం బయటపడింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, హిరన్ వాడ గ్రామానికి చెందిన 26 ఏళ్ల శ్వేత, సచిన్ కుమార్ భార్యాభర్తలు.


శనివారం భార్యాభర్తలు రోడ్డుపై వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో శ్వేత తీవ్రంగా గాయపడింది. గాయపడ్డ ఆమెను శామ్లీలోని డిస్ట్రిక్ట్ జాయింట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. శ్వేతను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయినట్లు తేల్చారు. పోలీసులు వచ్చే వరకు ఆమె శవాన్ని అక్కడి వార్డులో ఉంచారు. ఈ నేపథ్యంలోనే వార్డు బాయ్ విజయ్ దారుణానికి పాల్పడ్డాడు. ఎవరికీ అనుమానం రాకుండా శ్వేత చెవులకు ఉన్న కమ్మలను దొంగిలించాడు. కొద్దిసేపటి తర్వాత పోలీసులు అక్కడికి వచ్చారు. శవాన్ని పోస్టుమార్టంకు పంపడానికి ముందు.. దర్యాప్తు మొదలుపెట్టారు. అప్పుడు విజయ్ ఓ కమ్మను వారికి ఇచ్చాడు.


ఆ కమ్మ నేలపై దొరికిందని అన్నాడు. అయితే, పోలీసులకు అనుమానం వచ్చింది. సీసీటీవీ కెమెరా ఫొటేజీలను పరీక్షించారు. విజయ్, శ్వేత శవం నుంచి కమ్మలు తీస్తున్న దృశ్యాలు అందులో రికార్డు అయ్యాయి. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకోవాలని చూశారు. అప్పటికే అతడు ఆస్పత్రినుంచి పరారయ్యాడు. శ్వేత భర్త సచిన్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక, ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు విజయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

Wife With 4 Lovers: నలుగురు ప్రియులతో కలిసి భార్య ఘాతుకం.. భర్త హత్యకు కుట్ర..

ఫేక్ డాక్టర్‌తో ఇంట్లో ఆపరేషన్.. మహిళ ప్రాణం పాయే..

Updated Date - Apr 20 , 2025 | 12:49 PM