ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Viral News: ఇంటి భోజనం తినాలని ఉందన్న కంటెంట్ క్రియేటర్.. ఆతిథ్యం ఇచ్చి మరీ..

ABN, Publish Date - Jun 19 , 2025 | 02:01 PM

ఢిల్లీకి చెందిన ఓ కంటెంట్ క్రియేటర్ బెంగళూరుకు వెళ్లాడు. అయితే, బెంగళూరు జీవనశైలి ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అనుకున్నాడు. ఇందు కోసం అతను ఓ ఇంటికి వెళ్లి ఏం చేశాడంటే..

Viral News

Viral News: కంటెంట్ క్రియేటర్లు వివిధ రకాల కంటెంట్‌ను సృష్టిస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు. వ్లొగ్స్, వీడియోల కోసం కొత్త కొత్త ప్రదేశాలకు వెళతారు. ఈ క్రమంలోనే ఢిల్లీకి చెందిన ఓ కంటెంట్ క్రియేటర్, స్టార్టప్ వ్యవస్థాపకుడు సదీవ్ సింగ్ తన స్నేహితురాలితో కలిసి బెంగళూరుకు వెళ్లాడు. అయితే, బెంగళూరు జీవనశైలి, అక్కడి ఫుడ్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అనుకున్నాడు. ఇందు కోసం అతను ఓ ఇంటికి వెళ్లి అక్కడున్న మహిళతో తన పేరు సదీవ్ సింగ్ అని, తాను ఢిల్లీ నుంచి వచ్చానని చెబుతాడు. తర్వాత తనకు ఇంటి భోజనం తినాలని ఉంది, మీ ఇంట్లో పెట్టగలరా అని అడుగుతాడు.

అయితే, ఆ మహిళ వెంటనే తన భర్తను అడిగిన తర్వాత తిరిగి వస్తానని చెబుతుంది. ఆ వెంటనే భర్త బయటకు వచ్చి సింగ్‌ను తన స్నేహితురాలిని కలిసి ఇంటికి ఆహ్వానించాడు. వృద్ధ దంపతులు ఆ జంటకు సంతోషంగా ఆతిథ్యం ఇచ్చారు. వారికి కర్ణాటక సాంప్రదాయ అల్పాహారం రాగి ముద్దను వడ్డించారు. తర్వాత ఆ వృద్ధ దంపతులతో సింగ్‌ కాసేపు సరదాగా సమయం గడిపారు. ఇక బయలు దేరే ముందు సింగ్‌ తన స్నేహితురాలు ఆ దంపతుల కాళ్లు మొక్కడంతో వారు ఆశీర్వదించి హ్యాపీగా సెండ్‌ఆఫ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను సింగ్‌ తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది.

బెంగళూరులో ప్రజలు చాలా మంచివారని, అనుకోకుండా వెళ్లిన తనకు, తన స్నేహితురాలికి ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వదించారని పోస్ట్ చేశారు. ఆరోగ్యకరమైన ఇంటి వంటకం. అందులో రాగి ముద్ద, చట్నీ, ఆలూ కూర వంటి వాడిని వడ్డించారని, వారు ఇచ్చిన ఆతిథ్యానికి 'ఓ మై గాడ్' అంటూ చాలా ధన్యవాదాలు అని చెప్పాడు. వారి మర్యాదలు బాగా నచ్చాయని పేర్కొన్నారు.

Updated Date - Jun 19 , 2025 | 02:04 PM