ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Transgenders: డబ్బులు అడగొద్దన్నందుకు.. నడిరోడ్డులో పోలీస్‌పై ట్రాన్స్‌జెండర్ల దారుణం..

ABN, Publish Date - May 25 , 2025 | 09:01 PM

Transgenders: జనాల్ని ఆపి బలవంతంగా డబ్బులు వసూలు చేయటం మంచిది కాదని, అలా చేయటం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని చెప్పాడు. ఆ ట్రాన్స్‌జెండర్లకు మంగల్ హితబోధ నచ్చలేదు.

Transgenders

డబ్బులు వసూలు చేయొద్దన్నందుకు ఓ ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు దారుణానికి ఒడిగట్టారు. పోలీస్ అధికారిపై నడిరోడ్డులో దాడికి దిగారు. అందరూ చూస్తుండగా ఆయన్ని కొట్టారు. ఈ సంఘటన ఒరిస్సాలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఒరిస్సా, బార్‌గర్ టౌన్‌లోని గాంధీ చౌక్‌లో ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు బలవంతపు వసూళ్లకు దిగారు. సర్కిల్‌లో వెళ్లే పాదచారులు, వాహనదారుల దగ్గరినుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేయటం మొదలెట్టారు.


వారి కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతూ ఉంది. పోలీస్ వాహనంలో వెళుతున్న మంగల్ కిస్కో అనే పోలీస్ ఇది గమనించాడు. వారి దగ్గర వాహనం ఆపాడు. జనాల్ని ఆపి బలవంతంగా డబ్బులు వసూలు చేయటం మంచిది కాదని, అలా చేయటం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందని చెప్పాడు. ఆ ట్రాన్స్‌జెండర్లకు మంగల్ హితబోధ నచ్చలేదు. వాదులాటకు దిగారు. చినికి చినికి గాలి వాన అయినట్లు ఆ గొడవ పెద్దదైంది. ట్రాన్స్‌జెండర్లు ఆగ్రహానికి గురయ్యారు. పోలీసుకు మాటలతో సమాధానం చెప్పలేమని గ్రహించారు.


ఆయనపై దాడికి దిగారు. వాహనం లోంచి ఆయన్ని బయటకు లాగి కొట్టడానికి ప్రయత్నించారు. నడిరోడ్డులో.. నలుగురూ చూస్తున్నారన్న భయం లేకుండా.. అతడు ఓ పోలీస్ ఆఫీసర్ అన్న మర్యాద లేకుండా దారుణంగా ప్రవర్తించారు. దీన్నంతా అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీస్తూ ఉన్నాడు. ఓ ట్రాన్స్‌జెండర్ అతడి నుంచి ఫోన్ లాక్కోవటానికి ప్రయత్నించింది. ఇక, ట్రాన్స్‌జెండర్ల దాడిలో మంగల్ గాయపడ్డాడు. అతడ్ని ఆస్పత్రికి తరలించారు. ఆ ట్రాన్స్‌జెండర్లకు కూడా గాయాలు అవ్వటంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి

Little Girl Rides: చిన్న పాపకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ.. ఖర్చు రెండు పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్లు..

Annabelle Doll: ఎంతో మందిని భయపెట్టిన దెయ్యం బొమ్మ గల్లంతు..

Updated Date - May 25 , 2025 | 09:02 PM