Toothbrush in stomach: షాకింగ్.. 52 ఏళ్లుగా కడుపులోనే టూత్‌బ్రష్.. చివరకు అతడి పరిస్థితి ఏమైందంటే..
ABN, Publish Date - Jun 24 , 2025 | 03:54 PM
చాలా మంది పిల్లలు అప్పుడప్పుడు ఏవో చిన్న చిన్న వస్తువులను మింగేస్తుంటారు. కడుపులోకి వెళ్లిన తర్వాత అవి కొన్ని సమస్యలు సృష్టిస్తారు. వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే ఆపరేషన్ చేసి బయటకు తీస్తారు. అయితే తాజా సంఘటన గురించి వింటే మాత్రం షాకవ్వాల్సిందే.
చాలా మంది పిల్లలు అప్పుడప్పుడు ఏవో చిన్న చిన్న వస్తువులను మింగేస్తుంటారు. కడుపులోకి వెళ్లిన తర్వాత వాటి కారణంగా సమస్యలు ఉత్పన్నమవుతాయి. వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే ఆపరేషన్ చేసి బయటకు తీస్తారు. అయితే తాజా సంఘటన గురించి వింటే మాత్రం షాకవ్వాల్సిందే. చైనా (China)కు చెందిన ఓ వ్యక్తి 12 ఏళ్ల వయసులో 17 సెంటీమీటర్ల పొడువున్న టూత్‌బ్రష్ (Toothbrush)ను మింగేశాడు. ఇప్పుడు అతడికి 64 సంవత్సరాలు. దాదాపు 52 సంవత్సరాల పాటు ఆ టూత్‌బ్రష్ అతడి కడుపులోనే ఉండిపోయింది. జీర్ణవ్యవస్థలో సమస్యతో టెస్ట్ చేయించుకుంటే ఆ విషయం బయటపడింది (Toothbrush in stomach).
చైనాకు చెందిన యాంగ్ అనే వ్యక్తి 12 సంవత్సరాల వయసులో టూత్ బ్రష్‌ను మింగేశాడు. అయితే అతడు దాని గురించి తన తల్లిదండ్రులకు చెప్పడానికి భయపడ్డాడు. టూత్ బ్రష్ కడుపులోనే కరిగిపోతుందని యాంగ్ అనుకుని తన జీవితాన్ని కొనసాగించాడు. ఆ టూత్ బ్రష్ లోపలే ఉన్నప్పటికీ ఇప్పటివరకు, అతను ఎటువంటి ఆరోగ్య సమస్యనూ ఎదుర్కోలేదు. అయితే తాజాగా అతడు గ్యాస్ట్రిక్ సమస్యతో డాక్టర్ దగ్గరకు వెళ్లాడు. అతడికి స్కానింగ్ చేసిన డాక్టర్లు అతడి పేగుల్లో టూత్‌బ్రష్ ఉన్నట్టు గమనించారు. వెంటనే ఎండోస్కోపిక్ సర్జరీ చేసి ఆ బ్రష్‌ను తొలగించారు.
నిజానికి పేగుల్లో టూత్‌బ్రష్ ఇరుక్కుపోతే పేగు కణజాలం మొత్తం దెబ్బ తిని ప్రాణాపాయ పరిస్థితి తలెత్తుతుంది. అయితే యాంగ్ విషయంలో మాత్రం ఆ టూత్‌బ్రష్ పేగు మలుపులో ఇరుక్కుపోయి దశాబ్దాల పాటు కదలలేకపోయింది. అందువల్లే అతడికి ఎలాంటి ఆరోగ్య సమస్యా ఎదురుకాలేదు. అతడు నిజంగా చాలా అదృష్టవంతుడని చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేశారు. ఐదు దశాబ్దాలుగా శరీరంలో టూత్ బ్రష్ ఉన్నా జీవించి ఉండటం నిజంగా ఆదృష్టం అని మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Brain Test: మీరు నిజంగా జీనియస్ అయితే.. ఈ ఫొటోలో తప్పేంటో 7 సెకెన్లలో కనిపెట్టండి
ఆ గుండెకు ధైర్యం ఎక్కువే.. నీటిలోనే మొసళ్లను ఎలా పరిగెత్తించాడో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jun 24 , 2025 | 04:39 PM