Buffalo vs Snake: గేదె vs పాము.. రెండింటి మధ్య ఏం జరిగిందో చూడండి.. వీడియో వైరల్..
ABN, Publish Date - Jul 03 , 2025 | 06:01 PM
మనుషులే కాదు.. జంతువులు కూడా పాముల జోలికి వెళ్లవు. విషపూరిత సర్పాలు కాటు వేస్తే ఎంత పెద్ద జంతువు ప్రాణం అయినా గాల్లో కలిసిపోవాల్సిందే. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో తన దగ్గరకు వచ్చిన పాముతో ఓ గేదె వ్యవహరించిన తీరు చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది పాములంటేనే (Snakes) భయపడతారు. పాము ఉందని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా వణికిపోతారు. మనుషులే కాదు.. జంతువులూ పాముల జోలికి వెళ్లవు. విషపూరిత సర్పాలు కాటు వేస్తే ఎంత పెద్ద జంతువు ప్రాణం అయినా గాల్లో కలిసి పోవాల్సిందే. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో తన దగ్గరకు వచ్చిన పాముతో ఓ గేదె (Buffalo) వ్యవహరించిన తీరు చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Snake and Buffalo fight video).
mjunaid8335 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ చోట గేదెను కట్టేసి ఉంచారు. అక్కడికి ఓ నల్లత్రాచు వెళ్లింది. అది గేదె పక్క నుంచే వెళ్లినప్పటికీ దాని జోలికి వెళ్లలేదు. అక్కడే ఉన్న ఓ చెట్టు ఎక్కేందుకు ప్రయత్నించింది. అయితే ఆ గేదె తన నోటితో ఆ పామును అడ్డగించడానికి ప్రయత్నించింది. తన నోటితో ఆ పామును పట్టుకుంది. కోరికేసేందుకు ప్రయత్నించింది. అయినా ఆ పాము కోపం తెచ్చుకోకుండా తన దారిన తాను వెళ్లిపోవడానికి ప్రయత్నించింది. చివరకు గేదెకు దూరంగా వెళ్లిపోయింది.
ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 20 లక్షల మంది వీక్షించారు. 1.58 లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. అక్కడున్న కెమెరా మ్యాన్ చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించాడని చాలా మంది కామెంట్ చేశారు. కెమెరా మ్యాన్ తన వీడియో కోసం గేదె లేదా పాము ప్రాణాన్ని పణంగా పెట్టాడని మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
వీడు నావాడు.. పెళ్లి వేదికపై వరుడిని కౌగిలించుకున్న బుర్కా మహిళ.. వధువు రియాక్షన్ చూస్తే..
మీ పరిశీలనా శక్తికి పరీక్ష.. ఈ ఫొటోలో గుర్రం ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jul 03 , 2025 | 06:24 PM