What Not To Buy At Airport: ఎయిర్‌పోర్టుల్లో కొనకూడని వస్తువులు ఇవే
ABN, Publish Date - Apr 03 , 2025 | 11:35 PM
ఎయిర్‌పోర్టుల్లో లభించే వస్తువుల ధరలన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి విమానాశ్రయాల్లో ఏదైనా కొనుగోలు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించకోవాలని అనుభవజ్ఞులు చెబుతున్నారు.
విమానప్రయాణాలు ఖరీదైన వ్యవహారం. దీనికి తోడు ఎయిర్‌పోర్టుల్లో వస్తువులు కొనుగోలు చేస్తు ఖర్చులు తడిసిమోపెడవుతాయి. అయితే, విమానాల కోసం వేచి చూసే సమయంలో అనేక మంది తమ కంటికి కనిపించినవి కొనేస్తుంటారు. ఇలాంటి తొందరపాటు చర్యలు జేబులకు భారీ చిల్లు పెడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టుల్లో కొనుగోలు చేయకూడని వస్తువులు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఎయిర్‌పోర్టుల్లో డబ్బులు చెల్లించి వైఫై సేవలు పొందొద్దు. వైఫై ధరలు అధికంగా ఉండటమే కాకుండా వాటి వేగం కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి, ఎయిర్‌పోర్టుల్లో ఉన్నప్పుడు ఏదైనా పుస్తకం, లేదా పేపర్ చదువుకోవడం మంచిది
ఎయిర్‌పోర్టుల్లో చార్జర్లు హెడ్‌ఫోన్ల ధరలు కూడా మేఘాలను తాకుతుంటాయి. ఇంట్లో మర్చిపోయామన్న ఉద్దేశంతో ఎయిర్‌పోర్టుల్లో వీటిని కొంటే జేబుకు చిల్లుపెట్టుకున్నట్టే. ఆ మాటకొస్తే విమానాశ్రయాల్లోని అన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు 34 శాంతం అధికంగా ఉంటుందని కొందరు చెబుతుంటారు.
ప్రయాణానికి గుర్తుగా బొమ్మలు వంటివి కూడా కొనుగోలు చేయొద్దు. ఇవి కూడా అత్యధిక ధరలకు అమ్ముతుంటారు.
విమానప్రయాణాల్లో డీహైడ్రేషన్‌కు గురవడం సహజం ఇలాంటి సందర్భాల్లో చాలా మంది తమ వెంట నీళ్ల బాటిల్ తీసుకెళతారు కానీ ఎయిర్‌పోర్టుల్లో మాత్రం కొనరు.
విమానాశ్రయాల్లో ఆహారం కొనుగోలు చేసేదాని కంటే ఇంటివద్దే కడుపునిండా తిని బయలుదేరడం మంచిది. అక్కడి ధరలు ఎక్కువగా ఉండటమే కాకుండా రుచి కూడా బాగుండదు.
ఎయిర్‌పోర్టుల్లో కరెన్సీ ఎక్సేంజ్ చేసుకోవద్దు. ఇక్కడి రేట్లు కూడా అధికంగా ఉంటాయి.
పన్నుల బెడద ఉండదని చాలా మంది డ్యూటీ ఫ్రీ షాపులో మద్యం కొనుగోలు చేస్తారు కానీ అప్పటికే వాటిపై ధర ఎక్కువగా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి.
సుదీర్ఘ ప్రయాణాలు చేసేవారు కూడా నెక్ పిల్లోను ముందుగా కొని పెట్టుకోవడమే మంచిది. విమానాశ్రయాల్లో రెంటల్ కార్లు బుక్ చేసుకోవడం కూడా ఖర్చుతో కూడుకున్నదే. దీని గురించి కూడా ముందస్తుగా ప్లాన్ చేసుకోవడమే మంచిది. పుస్తకాలు మందులు వంటివి కూడా ఎయిర్‌పోర్టుకు చేరుకునే ముందు కొనుక్కోవడం మంచిది.
ఎయిర్‌పోర్టు్ల్లో పార్కింగ్ సేవలు వినియోగించుకునే దాని కంటే ఆ పక్కనే ఉండే ప్రైవేటు పార్కింగ్ సేవలను ఎంచుకోవడం మంచిది. ఇవి అందుబాటు ధరల్లోనే ఉంటాయి. విమానాశ్రయం వరకూ షటిల్ సర్వీసులను కూడా అందిస్తాయి.
ఇవి కూడా చదవండి:
మన దేశంలో అంట్లు తోమే డిష్ వాషర్లు ఎందుకు పాప్యులర్ కాదంటే..
భారత్‌పై అమెరికా సుంకాల ప్రభావం స్వల్పమే: మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్
కొత్తగా పెళ్లైన వాళ్లు ఫాలో కావాల్సిన ఆర్థిక సూత్రాలు
Updated Date - Apr 03 , 2025 | 11:35 PM