ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Shilpa Shirodkar: సూపర్ స్టార్ మహేష్ బాబు మరదలికి కొవిడ్

ABN, Publish Date - May 19 , 2025 | 04:50 PM

Shilpa Shirodkar: సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ చెల్లెలు శిల్పా శిరోద్కర్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమే తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు.

Shilpa Shirodkar

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ చెల్లెలు శిల్పా శిరోద్కర్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమే తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు సోమవారం తన ట్విటర్‌లో ఓ పోస్టు పెట్టారు. ‘ హల్లో పీపుల్.. నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. మీరు జాగ్రత్తగా ఉండండి. మాస్కులు ధరించండి‘ అని పేర్కొన్నారు.


బిగ్‌బాస్ 18తో గుర్తింపు

శిల్పా శిరోద్కర్ వికిపిడియా ప్రకారం.. ఆమె 1989 నుంచే సినిమాల్లో నటిస్తూ ఉన్నారు. 2000 సంవత్సరంలో సినిమాలకు దూరం అయ్యారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత బరూద్ అనే సినిమాతో మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు. మళ్లీ సినిమాలకు దూరం అయ్యారు. పది సంవత్సరాల తర్వాత 2020లో గన్స్ ఆఫ్ బనారస్ అనే సినిమాలో నటించారు. ఆ సినిమా కూడా విడుదలకు నోచుకోలేదు.


శిల్ప సినిమాలకు దూరంగా ఉన్నా సీరియల్స్ మాత్రం చేస్తూ వచ్చింది. 2013 నుంచి 2018 వరకు ఏక్ ముత్తి ఆస్మాన్, సిల్‌సిలా ప్యార్‌కా, సావిత్రి దేవీ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో నటించారు. సినిమాలు సీరియల్స్‌తో రాని గుర్తింపు బిగ్‌బాస్ షోతో వచ్చింది. బిగ్‌బాస్ 18లో ఆమె పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.


ఇవి కూడా చదవండి

Great Man Marulayya: చరిత్ర మర్చిపోయిన వీరుడు.. 6 వేల శవాలకు అంత్యక్రియలు చేశాడు..

Pakistani Spies: యూట్యూబర్ జ్యోతి నుంచి విద్యార్థి దేవేంద్ర వరకు.. 11 మందిపై దేశ ద్రోహం కేసు

Updated Date - May 19 , 2025 | 06:06 PM